సందడిగా వీకేఆర్‌ పూర్వ విద్యార్థుల సమ్మేళనం

ABN , First Publish Date - 2022-01-03T06:26:39+05:30 IST

సందడిగా వీకేఆర్‌ పూర్వ విద్యార్థుల సమ్మేళనం

సందడిగా వీకేఆర్‌ పూర్వ విద్యార్థుల సమ్మేళనం
రిటైర్డ్‌ అధ్యాపకుడు గన్నె వెంకట్రావును సత్కరిస్తున్న గద్దె రామ్మోహన్‌

గన్నవరం, జనవరి 2 : స్థానిక వేములపల్లి కోదండరామయ్య (వీకేఆర్‌) కళాశాల పూర్వ విద్యార్థుల సమావేశం ఆదివారం అదే కళాశాలలో సందడిగా జరిగింది. కళాశాల పూర్వ విద్యార్థులు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్‌, డీఎస్పీ ఎన్‌బీ మురళీకృష్ణ, ఎంపీపీ అనగాని రవి తదితర ప్రముఖులు హాజరయ్యారు. కళాశా లల్లో విద్యాభోధన చేసి వివిధ ప్రాంతాల్లో స్థిరపడిన వారు వచ్చారు. ఆనాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. ఎమ్మెల్యే గద్దె మాట్లాడుతూ ఈ కళాశాల ఎంతో మందికి జీవిత మార్గాన్ని చూపిందన్నారు. దేశ విదేశాల్లో ఉన్నత స్థాయిలో ఎంతో మంది రాణిస్తున్నారని చెప్పారు. అనంతరం ఆనాటి గురువులు గన్నె వెంకట్రావు, మద్దుకూరి విజయ్‌కుమార్‌, ఎం.ప్రభాకర్‌ చౌదరి, టీవీ సుబ్బారావు, శాయోజాతరావు, డీవి సుబ్బారావులను దుశ్శాలువ, పూల బొకేలతో ఘనంగా సత్కరించారు. కళాశాల యాజమాన్యం కమిటీ అధ్యక్షుడు ఎం.వెంకట్‌, కరస్పాం డెంట్‌ రత్న ప్రసాద్‌, టీఎస్‌ఆర్‌కె ప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు. 

Read more