ప్రభుత్వ నిర్లక్ష్యం.. రైతులకు శాపం

ABN , First Publish Date - 2022-12-10T01:27:20+05:30 IST

ప్రభుత్వం నిర్లక్ష్యం రైతులకు శాపంగా మారింది. పంట నూర్చి రోజులు గడు స్తున్నా, కొనే దిక్కు లేక కల్లాల్లోనే ధాన్యం ఉంది. రెండు రోజుల నుంచి రైతుల గుండెల్లో మాండోస్‌ తుపాను వణుకు పుట్టిస్తుంది. రైతుల కంటిపై కునుకు లేకుండా చేస్తుంది. ధాన్యం వైపు, ఆకాశం వైపు చూస్తూ దిగాలు చెం దుతున్నారు.

 ప్రభుత్వ నిర్లక్ష్యం.. రైతులకు శాపం
పురుషోత్తపట్నంలో ధాన్యంపై కప్పిన పరదాలు

గన్నవరం, డిసెంబరు 9 : ప్రభుత్వం నిర్లక్ష్యం రైతులకు శాపంగా మారింది. పంట నూర్చి రోజులు గడు స్తున్నా, కొనే దిక్కు లేక కల్లాల్లోనే ధాన్యం ఉంది. రెండు రోజుల నుంచి రైతుల గుండెల్లో మాండోస్‌ తుపాను వణుకు పుట్టిస్తుంది. రైతుల కంటిపై కునుకు లేకుండా చేస్తుంది. ధాన్యం వైపు, ఆకాశం వైపు చూస్తూ దిగాలు చెం దుతున్నారు. ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యం చేతికొచ్చిన సమయంలో మాండోస్‌ తుపాను కలవర పెడు తోంది. గన్నవరం మండలంలో సుమారు 15600 ఎకరాల్లో వరి పంట వేశారు. ఇప్పటికీ మిషన్‌తో 1850 ఎకరాల్లో 416మంది రైతులు పంటను నూర్చారు. 982 ఎకరాలు పనల మీద ఉంది. ప్రభుత్వం ఆర్‌బీకేల ద్వారా ప్రతి గింజ కొనుగోలు చేస్తామని చెప్పి ఆచరణలో రైతులను నట్టేట ముంచింది. ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేస్తుందని ఆశతో రైతులు పంట నూర్చారు. తుఫాన్‌ దగ్గరకు వచ్చే సరికి ఎవరికైన అమ్ముకోవచ్చని చావు కబురు చల్లగా ప్రభుత్వం చెప్పడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. నూర్చిన ధాన్యం కల్లాల్లో ఆరబెట్టుకుంటూ పరదాలు కప్పి వర్షం నుంచి కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. పనల మీద ఉన్న పంటను ఎలా కాపాడుకోవాలో అర్ధం కాక రైతు లు దిక్కుతోచని దుస్థితిలో ఉన్నారు. ఖర్చులు పెరి గినప్పటికీ కష్టపడి పండించిన పంటను మాండోస్‌ తుఫాన్‌ ఏం చేస్తుందోనని ఆందోళన రైతుల్లో ఉంది.

పెనమలూరు : ఒక పక్క తుపాను వల్ల వర్షం మొద లు, మరో పక్క పొలంలో ఆరబోసిన ధాన్యాన్ని ఎలాకాపాడుకోవాలో దిక్కుతోచక రైతు అగ చాట్లు.. .ఈ నేపఽథ్యంలో టీడీపీ తాడిగడప మునిసిపాలిటీ అధ్యక్షుడు అనుమోలు ప్రభాకరరావు తన అను చరులతో కలిసి రైతుల వెతలు తీర్చుతానంటూ వర్షంలోనే పోరంకి పొలాల్లోని రైతుల వద్దకు వెళ్లారు. వారి సమస్యలను స్వయంగా గమనించిన ఆయన వెంటనే రైతులకు సాయం చేయాల్సిం దిగా అనుచరులకు చెప్పడంతో ధాన్యం తడవకుండా రైతులకు పరదాలు కప్పడంలో సాయపడ్డారు.

Updated Date - 2022-12-10T01:27:44+05:30 IST