-
-
Home » Andhra Pradesh » Krishna » Photos of farmers should be uploaded-NGTS-AndhraPradesh
-
రైతుల ఫొటోలు అప్లోడ్ చేయాలి
ABN , First Publish Date - 2022-09-28T06:23:59+05:30 IST
సమగ్ర భూ సర్వే పూర్తి చేసుకున్న రైతుల నుంచి వారికి సంబంధించిన ఫొటోలు అప్లోడ్ చేయాలని రెవెన్యూ అధికారులను తిరువూరు ఆర్డీవో ప్రసన్నలక్ష్మి ఆదేశించారు.

సమగ్ర భూ సర్వేపై సర్వేయర్లు, రెవెన్యూ అధికారుల సమావేశంలో ఆర్డీవో ప్రసన్నలక్ష్మి
గంపలగూడెం: సమగ్ర భూ సర్వే పూర్తి చేసుకున్న రైతుల నుంచి వారికి సంబంధించిన ఫొటోలు అప్లోడ్ చేయాలని రెవెన్యూ అధికారులను తిరువూరు ఆర్డీవో ప్రసన్నలక్ష్మి ఆదేశించారు. గంపలగూడె తహసీల్దార్ కార్యాలయంలో మంగళవారం సమగ్ర భూ సర్వేపై సర్వేయర్లు, రెవెన్యూ అధికారులు ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఆర్డీవో మాట్లాడుతూ ఫొటోలు అప్లోడ్ కార్యక్రమాన్ని రెండు రోజుల్లో పూర్తిచేయాలన్నారు. డీటీ రాధికారాణి, ఆర్.ఐ మోహన్రావు, వీఆర్వోలు పాల్గొన్నారు.