పేరు మార్పుపై నిరసన హోరు

ABN , First Publish Date - 2022-09-24T06:31:47+05:30 IST

పేరు మార్పుపై నిరసన హోరు

పేరు మార్పుపై నిరసన హోరు
జంక్షన్‌లో టీడీపీ నేతల నిరసన ప్రదర్శన

ఫఎన్టీఆర్‌ హెల్త్‌ యూనివర్సిటీగానే కొనసాగించాలి : బచ్చుల అర్జునుడు 

హనుమాన్‌జంక్షన్‌, సెప్టెంబరు 23:  ఎన్టీఆర్‌ హెల్త్‌ యూనివర్సిటీ పేరు మార్పుపై శుక్రవారం అనేక చోట్ల టీడీపీ, ఎన్టీఆర్‌ అభిమా నుల ఆధ్వర్యంలో నిరసనలు హోరెత్తాయి. ఆంధ్ర రాష్ట్రానికి  ఐకాన్‌ లాంటి ఎన్టీఆర్‌ హెల్త్‌ యూని వర్సిటీకి వైఎస్‌ఆర్‌ పేరు పెట్టి తుగ్లక్‌ సీఎంగా జగన్‌ నిరూపించుకున్నాడని ఎమ్మెల్సీ, టీడీపీ ఇన్‌చార్జి బచ్చుల అర్జునుడు తీవ్రస్థాయిలో ధ్వజ మెత్తారు. విజయవాడ ఎన్టీఆర్‌ హెల్త్‌ యూని వర్సిటీకి  పేరు మార్చడాన్ని నిరసిస్తూ శుక్రవారం హనుమాన్‌జంక్షన్‌లో అర్జునుడు ఆధ్వర్యంలో టీడీపీ నాయకులు నిరసన ప్రదర్శన చేశారు. ప్రధాన సెంటర్‌ నుంచి ర్యాలీగా వెళ్లి కాకాని కల్యాణ మండపంలోని ఎన్టీఆర్‌ విగ్రహానికి పాలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా అర్జునుడు మాట్లాడుతూ, ఎన్టీఆర్‌ హెల్త్‌ యూ నివర్సిటీని ఎన్టీఆర్‌ పేరుతోనే కొనసాగించాలని ఆయన డిమాండ్‌ చేశారు.   ఈ సందర్భంగా జర్నలిస్ట్‌ కందుల రమేష్‌ రాసిన అమరావతి... వివాదాలు.. అను మానాలు పుస్తకాన్ని బచ్చుల అర్జునుడు ఆవిష్కరించి కార్యకర్తలకు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ బాపులపాడు మండల అధ్యక్ష కార్యదర్శులు దయాల రాజేశ్వ రరావు, పుట్టా సురేష్‌, ఆళ్ల గోపాలకృష్ణ, వేము లపల్లి శ్రీనివాసరావు, గుండపనేని ఉమా వరప్ర సాద్‌, మూల్పూరి సాయికల్యాణి, చిరు మామిళ్ల సూర్యం, చెన్నుబోయిన శివయ్య,  వడ్డిల్లి లక్ష్మి, మజ్జిగ నాగరాజు,  జగన్‌,  రవీంద్ర పాల్గొన్నారు.

ఎన్టీఆర్‌ విగ్రహాలకు క్షీరాభిషేకం 

హనుమాన్‌జంక్షన్‌ రూరల్‌ : రాజకీయాల కతీతంగా తెలుగువాడి వేడిని, ఖ్యాతిని ప్రపంచం నలుదిశలా వ్యాప్తి చేసిన మహా నాయకుడు ఎన్టీ ఆర్‌ అని, ఆయన స్థాపించిన ఆరోగ్య విశ్వవి ద్యాలయం పేరు మార్చడం సిగ్గుమాలిన చర్యని టీడీపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కొత్తపల్లి, కానుమోలు గ్రామాల్లో శుక్రవారం ఎన్టీఆర్‌ విగ్రహానికి క్షీరాభిషేకం చేసి టీడీపీ నాయకులు తమ నిరసన వ్యక్తం చేశారు.  ఈ కార్యక్రమంలో టీడీపీ గ్రామ కమిటీ అధ్యక్షుడు శివశంకర్‌, మాజీ సర్పంచ్‌లు దన్నే దుర్గారావు, చింతల వెంకట శివఅప్పారావు,  వీరమాచనేని బుజ్జి, గార్లపాటి రాజేశ్వరరావు, జాస్తి భూపతి, కంపసాటి కొండలరావు, తదితరులు పాల్గొన్నారు.

తెలుగు జాతిని అవమాన పరచటమే.. 

గన్నవరం : హెల్త్‌ యూనివర్సిటీకి ఎన్టీఆర్‌ పేరు తొలగించటం అంటే తెలుగుజాతిని అవ మాన పరచటమేనని టీడీపీ మండల అధ్యక్షుడు జాస్తి వెంకటేశ్వరరావు అన్నారు. మండలంలోని ముస్తాబాదలో ఎన్టీఆర్‌ విగ్రహం వద్ద టీడీపీ నాయకులు హెల్త్‌ యూని వర్సిటీకి ఎన్టీఆర్‌ పేరు తొలగించి వైఎస్‌ఆర్‌ పేరు పెట్టడాన్ని ఖండిస్తూ శుక్రవారం నిరసన తెలియజేశారు. ఈ సంద ర్భంగా జాస్తి  వెంకటేశ్వరరావు మాట్లాడుతూ, తుగ్లక్‌ పాలనకు మించి ఆంధ్రరాష్ట్రంలో జగన్‌ రెడ్డి పాలన సాగిస్తున్నారని చెప్పారు.  టీడీపీ మండల కార్యదర్శి బోడపాటి రవికుమార్‌,  మండవ లక్ష్మి,  మేడేపల్లి రమ,  పాలడుగు మల్లికా ర్జునరావు,  కాంతారావు, జూపల్లి సురేష్‌, కంచర్ల ఈశ్వరరావు, గోపాలరావు పాల్గొన్నారు. 

 ఫ చినఅవుటపల్లి డాక్టర్‌ సుధా అండ్‌ నాగేశ్వరరావు సిద్ధార్థ దంత వైద్య కళాశాలలో విద్యార్థులు నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. హెల్త్‌ యూనివర్సిటీకి ఎన్టీఆర్‌పేరునే కొనసాగించాలని డిమాండ్‌ చేశారు. నల్ల బ్యాడ్జీలతోనే క్లాసులకు హాజరయ్యారు.  

Read more