టీడీపీకి ఓటేశారని పెన్షన్‌ కట్‌

ABN , First Publish Date - 2022-10-05T07:51:38+05:30 IST

పంచాయతీ ఎన్నికల్లో టీడీపీకి ఓటేశారని మండలంలో పెద్ద వేమవరం గ్రామానికి చెందిన ఇద్దరు అర్హులకు పెన్షన్‌ కట్‌ చేయగా రాష్ట్ర తెలుగు యువత అధికార ప్రతినిధి బొల్లా రామకృష్ణ వారికి ఒక్కొక్కరికి రూ.20వేలు ఇచ్చి అండగా నిలిచారు.

టీడీపీకి ఓటేశారని పెన్షన్‌ కట్‌

ఆదుకున్న తెలుగు యువత నేత బొల్లా 

వత్సవాయి, అక్టోబరు 4 : పంచాయతీ ఎన్నికల్లో టీడీపీకి ఓటేశారని మండలంలో పెద్ద వేమవరం గ్రామానికి చెందిన ఇద్దరు అర్హులకు పెన్షన్‌ కట్‌ చేయగా రాష్ట్ర తెలుగు యువత అధికార ప్రతినిధి బొల్లా రామకృష్ణ వారికి ఒక్కొక్కరికి రూ.20వేలు ఇచ్చి అండగా నిలిచారు. గ్రామానికి చెందిన పగిడి పున్నమ్మ, నాగులుపాటి వెంకయ్య, కాకాని నాగేశ్వరరావు పెన్షన్లు నిలిపివేశారు. విషయం తెలుసుకున్న బొల్లా రామకృష్ణ వారిని పరామర్శించి, వారి పరిస్థితి దయనీయంగా ఉందని చెప్పటంతో ఒక్కొక్కరికి రూ.20వేలు చొప్పున ఆర్థికసహా యం అందించారు. మండలంలో పలు గ్రా మాల్లో ఇలాగే టీడీపీ సానుభూతిపరులకు అర్హత ఉన్నా చేయూతను నిలిపివేస్తే కోర్టుకు వెళ్లి సాధించామని, అలాగే వారికి పెన్షన్‌ వచ్చేలా చూస్తానని హామీ ఇచ్చారు. ఆయన వెంట జె.రాధాకృష్ణ మూర్తి పాల్గొన్నారు.

Read more