-
-
Home » Andhra Pradesh » Krishna » pedhala akali thirchedhee tdpnee-NGTS-AndhraPradesh
-
పేదల ఆకలి తీర్చేది టీడీపీనే
ABN , First Publish Date - 2022-09-08T06:11:56+05:30 IST
పేదల ఆకలి తీర్చేది టీడీపీనే

పెనమలూరు, సెప్టెంబరు 7 : పేదలు, నిరుపేదల ఆకలి తీర్చేది తెలుగుదేశం పార్టీ మాత్రమేనని మాజీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్ అన్నారు. బుధవారం కానూరు సనత్‌నగర్‌లో రామాలయం వద్ద పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ అన్నదాన కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ, రాష్ట్రవ్యాప్తంగా అన్న క్యాంటీన్ల ద్వార పేదవాడికి అన్నం పెడుతుంటే వైసీపీ గూండాలు సృష్టించిన అరాచకానికి నిరసనగా పార్టీ ఆధ్వర్యంలో అన్న సంతర్పణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని ఆయన తెలిపారు. వైసీపీ గూండాలు రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్న వికృత చేష్టలను ప్రజలు గమనిస్తున్నారని, త్వరలోనే బుద్ధి చెబుతారన్నారు. టీడీపీ మచిలీపట్నం పార్లమెంటు ఉపాధ్యక్షుడు వెలగపూడి శంకరబాబు మాట్లాడు తూ, పేదవాడికి అన్నం పెట్టడం ప్రభుత్వానికి చేతగాకపోగా పెట్టేవారికి అడ్డంకులు సృష్టించడం సిగ్గుచేటన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ తాడిగడప అధ్యక్షుడు అనుమోలు ప్రభాకరరావు, ప్రధాన కార్యదర్శి అంగిరేకుల మురళి, పార్టీ పెనమలూరు మండల అధ్యక్షుడు దొంతగాని పుల్లేశ్వరరావు, కోయ ఆనంద్‌ప్రసాద్, షేక్ బుజ్జి, షేక్ సమీర్, మహమ్మద్ ఇక్బాల్, సయ్యద్ ఇబ్రహీం, దండమూడి సాయిసుధ, హాజీ షేక్ ఇమాం, కొమ్మినేని వెంకటేష్, ఆచంట వెంకట చంద్ర, మేడసాని రత్నకుమారి, సౌజన్య, మల్లంపాటి విజయలక్ష్మి పాల్గొన్నారు.