పటిష్ఠ ఏర్పాట్లు చేయండి

ABN , First Publish Date - 2022-08-17T06:57:39+05:30 IST

పటిష్ఠ ఏర్పాట్లు చేయండి

పటిష్ఠ ఏర్పాట్లు చేయండి

సీఎం సభపై మంత్రి జోగి రమేష్‌ సమీక్ష

పెడన, ఆగస్టు 16 :  ముఖ్యమంత్రి జగన్‌మోహనరెడ్డి ఈనెల 23వ తేదీన తొలిసారిగా పెడనకు విచ్చేస్తున్న సందర్భంగా బహిరంగ సభ ఏర్పాట్లు పక్కాగా చేయాలని మంత్రి జోగి రమేష్‌ అధికారులను ఆదేశించారు. మంగళవారం పెడన మార్కెట్‌ యార్డులో  జిల్లా అధికారులతో  సమావేశం నిర్వహించారు. సమ న్వయకర్త తలశిల రఘురామ్‌, కలెక్టర్‌ రంజిత్‌ బాషా, ఎస్పీ జాషువా, జేసీ మహేష్‌కుమార్‌, జిల్లా అధికారులు పాల్గొన్నారు. మంత్రి  మాట్లాడుతూ, సుమారు 40 వేల మందితో భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నామన్నారు. 20 మంది చేనేత కార్మికులను ఎంపిక చేసి సీఎంతో గ్రూపు ఫొటో దిగేలా ఏర్పాట్లు చేయాలన్నారు. కలెక్టర్‌ మాట్లాడుతూ, పారిశుధ్యంపై ప్రత్యేకశ్రద్ధ పెట్టాలని డివిజనల్‌ పంచాయతీ అధికారి, మునిసిపల్‌ కమిషనర్లను ఆదేశించారు. సమావే శంలో డీఆర్వో ఎం.వెంకటేశ్వర్లు, బందరు, గుడి వాడ, ఉయ్యూరు ఆర్డీవోలు కిషోర్‌, పద్మావతి, విజయకుమార్‌, డ్వామా పీడీ సూర్యనారాయణ, హ్యాండ్లూమ్స్‌ ఏడీ రఘునంద, ముడా వీసీ నారాయణరెడ్డి, డీఎంహెచ్‌వో గీతాబాయి, మత్స్యశాఖ జేడీ శ్రీనివాసరావు హాజరయ్యారు.

Read more