పశుసంక్రమిత వ్యాధులపై అవగాహన

ABN , First Publish Date - 2022-07-07T06:09:10+05:30 IST

పశుసంక్రమిత వ్యాధులపై అవగాహన

పశుసంక్రమిత వ్యాధులపై అవగాహన

 హనుమాన్‌జంక్షన్‌ రూరల్‌, జూలై 6 : పెంపుడు జంతువులు, పశు వుల నుంచి మనుష్యులకు వ్యాధులు సంక్రమించకుండా తగు జాగ్రత్తలు తీసు కోవాలని, పశు సంక్రమిత వ్యాధులపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని పశు వైద్యురాలు దివ్య సూచించారు. వీరవల్లిలో బుధ వారం ప్రపంచ జునోసిస్‌ డే సందర్భంగా అవగాహన కార్యక్రమం నిర్వ హించారు. జునోటిక్‌ వ్యాధులపై అవగాహన పెంపొందించే కరపత్రాలను అందజేసి పెంపుడు శునకాలకు ఉచితంగా రేబీస్‌ వ్యాధి నిరోధక టీకాలను వేశారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ మాజీ డైరెక్టర్‌ కోడెబోయిన బాబి, ఏహెచ్‌ఏ తిరుపతిరావు, శ్యామల తదితరులు పాల్గొన్నారు.

గన్నవరం : జంతువుల నుంచి మనుషులకు సంక్రమించే వ్యాధుల పట్ల ప్రజు అప్రమత్తంగా ఉండాలని ఎన్టీఆర్‌ పశువైద్య కళాశాల అసోసియేట్‌ డీన్‌ డాక్టర్‌ పీవిఎ ఎస్‌ కిషోర్‌ అన్నారు. స్థానిక బుద్దవరం రోడ్డులోని కళాశాలకు చెందిన క్లీనికల్‌ కాంప్లెక్స్‌లో బుధవారం ప్రపంచ జూనోసిస్‌ దినోత్సవం పెంపుడు కుక్కలకు ఉచిత యాంటీ రేబీస్‌ టీకాలు వేశారు. ఈ సందర్భంగా కిషోర్‌ మాట్లాడుతూ  రేబీస్‌ బారిన పడకుండా తప్పనిసరిగా యాంటీ రేబీస్‌ టీకాలు వేయించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వైద్యులు టి. శ్రీనివాసరావు, ఎన్‌ లక్ష్మీరాణి, శ్రీను, సురేష్‌, మందా శ్రీనివాస్‌, హరికృష్ణ, చంద్రప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు. 

Read more