నగర సుందరీకరణకు భాగస్వాములు కండి

ABN , First Publish Date - 2022-09-25T05:45:46+05:30 IST

నగరాన్ని సుందరీకరించటంలో స్వచ్ఛందంగా భాగస్వాములై తమ వంతు కృషి చేయాలని నగరపాలక సంస్థ అదనపు కమిషనర్‌ (జనరల్‌) శ్యామల అన్నారు.

నగర సుందరీకరణకు భాగస్వాములు కండి
ర్యాలీలో అదనపు కమిషనర్‌ (జనరల్‌) శ్యామల, శ్రీ విద్యాంజలి ప్రిన్సిపాల్‌ శ్రీనివాసరావు తదితరులు

నగర సుందరీకరణకు భాగస్వాములు కండి

నగరపాలక సంస్థ అదనపు కమిషనర్‌ శ్యామల

వించిపేట, సెప్టెంబరు 24 : నగరాన్ని సుందరీకరించటంలో స్వచ్ఛందంగా భాగస్వాములై తమ వంతు కృషి చేయాలని నగరపాలక సంస్థ అదనపు కమిషనర్‌ (జనరల్‌) శ్యామల అన్నారు. స్వచ్ఛ అమృత్‌ మహోత్సవంలో భాగంగా 55వ డివిజన్‌ నైజాంగేట్‌ రోడ్డులోని వీఎంసీ పార్కు వద్ద్ద శ్రీ విద్యాంజలి హైస్కూలు, రాకేష్‌ పబ్లిక్‌ స్కూలు విద్యార్థులతో కలిసి ఆమె శనివారం స్వచ్ఛత ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంలో నైజాంగేటు రోడ్డులోని వీఎంసీ పార్క్‌ వద్ద రోడ్డు వెంబడి ఉన్న పిచ్చిమొక్కలను తొలగించి, డివైడర్‌ గోడకు పెయింటింగ్‌ వేశారు. అనంతరం విద్యార్థులకు గుడ్డ సంచులను అందజేశారు. శ్రీ విద్యాంజలి హైస్కూలు ప్రిన్సిపాల్‌ పుప్పాల శ్రీనివాసరావు, ఈఈ నారాయణ మూర్తి, హెల్త్‌ ఆఫీసర్లు డాక్టర్‌ సురేష్‌ బాబు, శానిటరీ సూపర్‌వైజర్‌ ఓబేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

భవానీపురం:  45వ డివిజన్‌ కార్పొరేటర్‌ మైలవరపు మాధురి లావణ్య శనివారం బ్రహ్మయ్యనగర్‌లో వీధులను శుభ్రం చేయడంతో పాటు పిచ్చి మొక్కలను తొలగించారు. అనంతరం చర్చి ప్రాంతంలో మొక్కలను నాటారు. నాయకులు ఎం.కృష్ణ, శానిటరీ ఇన్‌స్పెక్టర్‌ ఎ.వెంకటేశ్వరరావు, మేస్త్రీ రామిరెడ్డి, సెక్రటరీలు పాల్గొన్నారు. 

సత్యనారాయణపురం: స్థానిక గిరివీధిలోని శానిటరీ ఆఫీసు ఆవరణలో శనివారం మొక్కలు నాటారు. ఈ సందర్భంగా 33వ డివిజన్‌ కార్పొరేటర్‌ శర్వాణీ మూర్తి మాట్లాడుతూ ప్లాస్టిక్‌ వినియోగాన్ని తగ్గించాలని, గుడ్డ, నార సంచులను మాత్రమే ఉపయోగించాలన్నారు. శానిటరీ ఇన్‌స్పెక్టర్‌ నాయక్‌, శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.

ఫ 30వ డివిజన్‌ రామకృష్ణాపురం, దేవినగర్‌లో కార్పొరేటర్‌ బీహెచ్‌ఎస్‌వీ జానారెడ్డి ఆధ్వర్యంలో శనివారం మొక్కలు నాటారు. స్థానికులు, శానిటరీ సిబ్బంది పాల్గొన్నారు.

వన్‌టౌన్‌: ఎస్‌కేపీవీవీ హిందూ హైస్కూల్‌లో 53వ డివిజన్‌ కార్పొరేటర్‌ మహదేవ్‌ అప్పాజీరావు  శనివారం మొక్కలు నాటారు. మొక్కలు పంపిణీ చేశారు. జెండాచెట్లు ప్రాంతంలో పిచ్చి మొక్కలను తొలగించారు. హైస్కూల్‌ కమిటీ కార్యదర్శి కేఎల్‌వీ మోహనరావు, ప్రధానోపాధ్యాయుడు కంచర్ల శ్రీనివాసరావు, ఉపాధ్యాయులు భరత్‌కుమార్‌, ఆనందకుమార్‌, ఎస్‌.వెంకటేశ్వరరావు, శ్రీనివాస్‌, రాజశేఖర్‌, కృష్ఱ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-09-25T05:45:46+05:30 IST