22న శాప్‌ లీగ్‌ జిల్లాస్థాయి రెజ్లింగ్‌ పోటీలు

ABN , First Publish Date - 2022-02-19T06:24:35+05:30 IST

22న శాప్‌ లీగ్‌ జిల్లాస్థాయి రెజ్లింగ్‌ పోటీలు

22న శాప్‌ లీగ్‌ జిల్లాస్థాయి రెజ్లింగ్‌ పోటీలు

భవానీపురం, ఫిబ్రవరి 18 : కృష్ణాజిల్లా క్రీడాప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో ఈనెల 22న శాప్‌ లీగ్‌ జిల్లాస్థాయి రెజ్లింగ్‌ పోటీలను ఉంగుటూరు మండలం తేలప్రోలులోని శ్రీరంగమ్మ తల్లి కల్యాణమండపంలో నిర్వహిస్తామని డీఎ్‌సఏ చీఫ్‌ కోచ్‌ బి.శ్రీనివాసరావు, యువజన సర్వీసులు, క్రీడల శాఖ సీఈవో యు.శ్రీనివాసరావు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. 17 ఏళ్లలోపు బాలబాలికలకు పోటీలు జరుగుతాయని, గ్రీకో రోమన్‌, ఫ్రీస్టయిల్‌ విభాగాల్లో బాలురుకు 45, 48, 51, 55, 60, 65, 71, 80, 92, 110 కేజీలు, బాలికలకు 40, 43, 46, 49, 53, 57, 61, 65, 69, 73 కేజీల విభాగాల్లో పోటీలు జరుగుతాయని వివరించారు. బంగారు పతకాలు గెలుపొందిన వారిని రాష్ట్రస్థాయి  పోటీలకు పంపుతామని, పురుషులు, మహిళల విభాగాల్లోనూ పోటీలు జరుగుతాయని పేర్కొన్నారు. ఆసక్తి కలిగినవారు ఈ నెల 20వ తేదీ సాయంత్రంలోగా తమ ఎంట్రీలను పీడీ మిరియాల సాయికుమార్‌ 868995454, 7981368418 నెంబర్లలో సంప్రదించాలని, రూ.100 ఎంట్రీ ీఫీజుతో ఆధార్‌కార్డు, వయసు ధ్రువీకరణ పత్రాలతో 22వ తేదీ ఉదయం 9 గంటలకు పోటీలు జరిగే ప్రాంతానికి రావాలని వివరించారు. 

Read more