కాళీమాతకు పట్టువస్త్రాల సమర్పణ

ABN , First Publish Date - 2022-09-26T06:06:57+05:30 IST

కాళీమాతకు పట్టువస్త్రాల సమర్పణ

కాళీమాతకు పట్టువస్త్రాల సమర్పణ
పట్టువస్ర్తాలు తీసుకెళుతున్న కృష్ణలంక సీఐ ఎం.వి.దుర్గారావు దంపతులు

కృష్ణలంక: త్రిశక్తిపీఠంలోని కాళీమాతకు కృష్ణలంక సీఐ ఎం.వి.దుర్గారావు దంపతులు ఆదివారం పట్టువస్త్రాలు సమర్పించారు. సోమవారం నుంచి దసరా శరన్నవరాత్రులు ప్రారంభం కానున్న నేపథ్యంలో అమ్మవారికి తొలిసారిగా కృష్ణలంక పోలీసులు పట్టువస్ర్తాలు సమర్పించాలని నిర్ణయించారు. ఇక నుంచి ఏటా శరన్నవరాత్రుల ప్రారంభానికి ముందురోజు కృష్ణలంక ఎస్‌హెచ్‌వోగా ఉన్న సీఐ కాళీమాతకు పట్టువస్ర్తాలు సమర్పిస్తారని సీఐ దుర్గారావు తెలిపారు. ఆలయ కమిటీ కార్యవర్గసభ్యులు జి.పుల్లయ్య, కొప్పురావూరి జగదీష్‌కుమార్‌, తుర్లపాటి మల్లేశ్వరరావు, గొల్లపూడి సత్యనారాయణ, మానేపల్లి వెంకటసుబ్బారావు, విజయ్‌కిరణ్‌, పెరుమాళ్ల సుబ్బారావు, కొనకళ్ల శేషసాయి పాల్గొన్నారు. Read more