హెల్త్‌ వర్సిటీకి ఎన్టీఆర్‌ పేరు కొనసాగించాలి

ABN , First Publish Date - 2022-10-03T06:06:58+05:30 IST

హెల్త్‌ యూనివర్సిటీకి ఎన్టీఆర్‌ పేరు కొనసాగించాలని టీడీపీ ఆధ్వర్యంలో జరుగుతున్న రిలే దీక్షల్లో ఆదివారం ఎస్టీసెల్‌ విభాగం నాయకులు దీక్ష చేపట్టారు.

హెల్త్‌ వర్సిటీకి ఎన్టీఆర్‌ పేరు కొనసాగించాలి
తిరువూరు రిలే దీక్షలో పాల్గొన్న శావల దేవదత్‌ తదితరులు

తిరువూరు, అక్టోబరు 2: హెల్త్‌ యూనివర్సిటీకి ఎన్టీఆర్‌ పేరు కొనసాగించాలని టీడీపీ  ఆధ్వర్యంలో జరుగుతున్న రిలే దీక్షల్లో ఆదివారం ఎస్టీసెల్‌ విభాగం నాయకులు దీక్ష చేపట్టారు.  టీడీపీ నియోజకవర్గం ఇన్‌చార్జి శావల దేవదత్‌ శిబిరం వద్ద ఎన్టీఆర్‌ విగ్రహానికి పూలమాల వేసి దీక్షను ప్రారంభించి మాట్లాడుతూ ప్రజల ఆగ్రహంతో ఈ ప్రభుత్వం తుడిచిపెట్టుకు పొతుందన్నారు. మాజీ ఏఎంసీ చైర్మన్‌ ఆలవాల రమే్‌షరెడ్డి, కందిమళ్ల శేషగిరిరావు, కొత్తపల్లి ఆనంద్‌స్వరూప్‌, కృష్ణమోహన్‌ తదితరులు సంఘీభావం తెలిపారు. 


Read more