AP News: మద్యం సేవించి మహిళ ఇంట్లో దూరి....

ABN , First Publish Date - 2022-12-10T08:17:40+05:30 IST

జిల్లాలోని మైలవరం మండలం పొందుగల తండాలో ఓ వ్యక్తి మద్యం తాగి వ్యక్తి హల్‌చల్ చేశాడు.

AP News: మద్యం సేవించి మహిళ ఇంట్లో దూరి....

ఎన్టీఆర్ జిల్లా: జిల్లాలోని మైలవరం మండలం పొందుగల తండాలో ఓ వ్యక్తి మద్యం తాగి వ్యక్తి హల్‌చల్ చేశాడు. సదరు వ్యక్తి తప్పతాగి అర్ధరాత్రి ఓ మహిళ ఇంట్లో దూరి అసభ్యంగా ప్రవర్తించాడు. తండాకు చెందిన వ్యక్తి తన భర్త ఇంట్లో లేని సమయంలో ఇంట్లోకి దూరి అసభ్యంగా ప్రవర్తించాడని మహిళ చెబుతోంది. ఇదేమిటని ప్రశ్నించిన ఇరుగు పొరుగువారిపై విచక్షణారహితంగా కర్రలతో దాడి చేశాడని తెలిపింది. దాడిలో ఐదుగురు వ్యక్తులు గాయపడగా వారిని కుటుంబసభ్యులు వెంటనే మైలవరం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Updated Date - 2022-12-10T08:17:41+05:30 IST