ఎన్టీఆర్‌ జిల్లా ఏపీఆర్‌ఎ్‌సఏ ఎన్నికలు ఏకగ్రీవం

ABN , First Publish Date - 2022-08-21T06:23:43+05:30 IST

ఎన్టీఆర్‌ జిల్లా ఏపీఆర్‌ఎ్‌సఏ ఎన్నికలు ఏకగ్రీవం

ఎన్టీఆర్‌ జిల్లా ఏపీఆర్‌ఎ్‌సఏ ఎన్నికలు ఏకగ్రీవం

- అధ్యక్ష, కార్యదర్శులుగా డి.శ్రీనివాస్‌, బత్తిన రామకృష్ణ 

విజయవాడ, ఆగస్టు (ఆంధ్రజ్యోతి) : కొత్తగా ఏర్పడిన ఎన్టీఆర్‌ జిల్లాలో ఏపీ రెవెన్యూ సర్వీసు అసోసియేషన్‌ (ఏపీఆర్‌ఎ్‌సఏ) ఎన్నికలు ఏకగ్రీవమయ్యాయి. శనివారం విజయవాడలోని ఏపీ రెవెన్యూ భవన్‌లో ఎన్టీఆర్‌జిల్లా బ్రాంచ్‌కు రెవెన్యూ సర్వీసు అసోసియేషన్‌ ఎన్నికలు జరిగాయి. ఏపీఆర్‌ఎ్‌సఏ రాష్ట్ర అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు బలపరిచిన డి.శ్రీనివాస్‌, బత్తిన రామకృష్ణల ప్యానెల్‌ ఏకగ్రీవంగా ఎన్నికైంది. ఎన్టీఆర్‌ జిల్లా బ్రాంచ్‌ ఎన్నికలలో పోటీ ప్యానెల్‌ లేకపోవటంతో.. ఏకగ్రీవమైనట్టు ఎన్నికల అదిఇకారి ఈ ఫణికుమార్‌ ప్రకటించారు. బొప్పరాజు బలపరిచిన ప్యానెల్‌ తరపున 21 మంది ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఎన్టీఆర్‌ జిల్లా బ్రాంచ్‌కు ఎన్నికైన నాయకత్వాన్ని బొప్పరాజు వెంకటేశ్వర్లు అభినందించారు. ఎన్నికల పరిశీలకులుగా ఎన్‌ శ్రీనివాస్‌ వ్యవహరించారు. 

నూతన కార్యవర్గం : 

అధ్యక్షుడు ఏఎ్‌సవో సర్కిల్‌-2కు చెందిన డీటీ డి.శ్రీనివాస్‌, అసోసియేట్‌ అధ్యక్షుడు ఇంతియాజ్‌ పాషా (కలెక్టరేట్‌ ఏవో), ఉపాధ్యక్షులు ఎన్‌.శ్రీనివాస మూర్తి (విజయవాడ సెంట్రల్‌ డీటీ), ఎస్‌వీ రవీంద్రనాథ్‌ (విజయవాడ ఈస్ట్‌ డీటీ), ఎస్‌వీఎన్‌ రాజేశ్వరి (విజయవాడ సెంట్రల్‌ మండల సీనియర్‌ అసిస్టెంట్‌), జి.వెంకటేశ్వరరావు (తిరువూరు ఆర్డీవో కార్యాలయ డీటీ), కార్యదర్శి బత్తిన రామక్రిష్ణ (ఇబ్రహీంపట్నం డీటీ), ఆర్గనైజింగ్‌ సెక్రటరీ వి.సాయి మహే్‌షబాబు (ఇబ్రహీంపట్నం డీటీ), స్పోర్ట్స్‌ అండ్‌ కల్చరల్‌ సెక్రటరీ పి.కళ్యాణి (సబ్‌ కలెక్టరేట్‌ డీటీ), జాయింట్‌ సెక్రటరీలు కె.శిరీష (ఎంఆర్‌ఐ, కంచికచర్ల), బి.సాయికుమార్‌ (ఆఫీసు సబార్డినేట్‌, విజయవాడ సెంట్రల్‌), ఎన్‌.అనూష్‌ కుమార్‌ (ఫుడ్‌ ఇన్‌స్పెక్టర్‌, నందిగామ), కోశాధికారి బి.సాయి శ్రీనివాస నాయక్‌ (తహసీల్దార్‌, విజయవాడ రూరల్‌), ఎగ్జిక్యూటివ్‌ మెంబర్స్‌ జి.వరప్రసాద్‌ (జూనియర్‌ అసిస్టెంట్‌, విజయవాడ నార్త్‌ మండలం), కె.బసివిరెడ్డి (స్టేట్‌ గెస్ట్‌హౌస్‌ డీటీ), కె.కిషోర్‌ (యూడీసీఐ, ఏఎ్‌సఓ సర్కిల్‌-2), ఎన్‌.నాగమల్లేశ్వరరావు, (ఆర్‌ఐ, విజయవాడ సెంట్రల్‌), ఎస్‌.సురేష్‌ రెడ్డి (సీనియర్‌ అసిస్టెంట్‌, చందర్లపాడు), ఇస్మాయిల్‌ (డిప్యూటీ తహసీల్దార్‌, కంచికచర్ల).

Read more