నూజివీడును విజయవాడ జిల్లాలో ఉంచాలి

ABN , First Publish Date - 2022-02-16T06:37:26+05:30 IST

నూజివీడును విజయవాడ కేంద్రంగా ఉన్న జిల్లాలోనే ఉంచాలని నూజివీడు సాధన సమితి జేఏసీ నాయకులు నూజివీడు తహసీల్దార్‌కు వినతిపత్రాన్ని అందించారు.

నూజివీడును విజయవాడ జిల్లాలో ఉంచాలి
నూజివీడు తహసీల్దార్‌ కార్యాలయంలో వినతిపత్రం అందిస్తున్న సాధన సమితి నాయకులు

సాధన సమితి జేఏసీ నాయకుల డిమాండ్‌

నూజివీడు టౌన్‌, ఫిబ్రవరి 15: నూజివీడును విజయవాడ కేంద్రంగా ఉన్న జిల్లాలోనే ఉంచాలని నూజివీడు సాధన సమితి జేఏసీ నాయకులు నూజివీడు తహసీల్దార్‌కు వినతిపత్రాన్ని అందించారు. నూజివీడును విడగొట్టడం వల్ల 14 మండలాల రెవెన్యూ కేంద్రం కేవలం 6 మండలాలకు తగ్గుతుందన్నారు. దాని వల్ల వ్యాపార, వాణిజ్యాలు దెబ్బతినడమే కాక భూములు ధరలు పతనమవుతాయన్నారు. గోదావరి జిల్లాతో పోలిస్తే నూజివీడు భాష, యాస, ఆచార సంప్రదాయ వ్యవహారాలు భిన్నంగా ఉంటాయని, ప్రతి అంశాన్ని పరిగణలోకి తీసుకొని నూజివీడును ఎమ్మార్‌ అప్పారావు పేరుతో ప్రత్యేక జిల్లాగా ఏర్పాటు చేయాలని లేదా విజయవాడ కేంద్రంగా ఉండే జిల్లాలో ఉంచాలని కోరారు. కార్యక్రమంలో జేఏసీ నాయకులు నెరసు కృష్ణాంజనేయులు, బత్తుల వెంకటేశ్వరరావు, మరీదు శివ రామకృష్ణ, చాట్ల పుల్లారావుపాల్గొన్నారు. 


Read more