సిద్ధార్థ మహిళా కళాశాలలో జాతీయ సైన్స్‌ వారోత్సవాలు ప్రారంభం

ABN , First Publish Date - 2022-02-23T06:26:21+05:30 IST

ఈ నెల 28న జాతీయ సైన్స్‌ దినోత్సవాన్ని పురస్కరించుకుని తమ కళాశాలలో సైన్స్‌ అసోసి యేషన్‌ ఆధ్యర్యంలో మంగళ వారం నుంచి జాతీయ సైన్స్‌ వారోత్సవాలు నిర్వహిస్తున్నామని, ఈ నెల 28 వరకు కొనసాగుతాయని సిద్ధార్థ మహిళా కళాశాల ప్రిన్సిపాల్‌ ఎస్‌.కల్పన తెలిపారు.

సిద్ధార్థ మహిళా కళాశాలలో   జాతీయ సైన్స్‌ వారోత్సవాలు ప్రారంభం
వాల్‌పోస్టర్‌ను ఆవిష్కరిస్తున్న డైరెక్టర్‌ టి.విజయలక్ష్మి, ఎస్‌.కల్పన

సిద్ధార్థ మహిళా కళాశాలలో 

జాతీయ సైన్స్‌ వారోత్సవాలు ప్రారంభం

లబ్బీపేట, ఫిబ్రవరి 22: ఈ నెల 28న జాతీయ సైన్స్‌ దినోత్సవాన్ని పురస్కరించుకుని తమ కళాశాలలో సైన్స్‌ అసోసి యేషన్‌ ఆధ్యర్యంలో మంగళ వారం నుంచి జాతీయ సైన్స్‌ వారోత్సవాలు నిర్వహిస్తున్నామని, ఈ నెల 28 వరకు కొనసాగుతాయని సిద్ధార్థ మహిళా కళాశాల ప్రిన్సిపాల్‌ ఎస్‌.కల్పన తెలిపారు. ఈ సందర్భంగా మంగళ వారం కళాశాలలో జరిగిన కార్యక్రమంలో వారోత్సవాల వాల్‌పోస్టర్‌ను  డైరెక్టర్‌ టి.విజయలక్ష్మి ఆవిష్కరించారు. అనంతరం ప్రిన్సిపాల్‌ కల్పన మాట్లాడుతూ ఈ వారం రోజుల పాటు వివిధ అంశాలపై సెమినార్స్‌, పోటీలు, ప్రముఖ సైన్స్‌ శాస్త్రవేత్తలతో విద్యార్థులకు అవగాహనా సదస్సులు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జి.మీనాక్షి, ఇతర సైన్స్‌ విభాగ అధిపతులు పాల్గొన్నారు.

Read more