జిల్లాస్థాయి దేశభక్తి గీతాల పోటీల్లో నలంద విద్యార్థులు ఫస్ట్‌

ABN , First Publish Date - 2022-11-08T00:42:41+05:30 IST

భారత వికాస్‌ పరిషత్‌ నిర్వహించిన జిల్లాస్థాయి హిందీ దేశభక్తి గీతాల పోటీల్లో నలంద విద్యానికేతన్‌ విద్యార్థులు ప్రథమ బహుమతిని గెలుచుకున్నారని నలంద విద్యానికేతన్‌ ప్రిన్సిపాల్‌ మాదల పద్మజ తెలిపారు.

జిల్లాస్థాయి దేశభక్తి గీతాల పోటీల్లో నలంద విద్యార్థులు ఫస్ట్‌

జిల్లాస్థాయి దేశభక్తి గీతాల పోటీల్లో నలంద విద్యార్థులు ఫస్ట్‌

గవర్నర్‌పేట, నవంబరు 7: భారత వికాస్‌ పరిషత్‌ నిర్వహించిన జిల్లాస్థాయి హిందీ దేశభక్తి గీతాల పోటీల్లో నలంద విద్యానికేతన్‌ విద్యార్థులు ప్రథమ బహుమతిని గెలుచుకున్నారని నలంద విద్యానికేతన్‌ ప్రిన్సిపాల్‌ మాదల పద్మజ తెలిపారు. బహుమతి గెలుచుకున్న విద్యార్థుల అభినందన కార్యక్రమం సోమవారం పాఠశాల ప్రాంగణంలో జరిగింది. ఈ సందర్భంగా పద్మజ మాట్లాడుతూ సిద్ధార్థ ఆడిటోరియంలో జరిగిన జిల్లాస్థాయి పోటీల్లో తమ పాఠశాలకు చెందిన 9వ తరగతి విద్యార్థులు ఫస్ట్‌ ప్రైజ్‌ సాధించారని తెలిపారు. ఈనెల 11న జరిగే సౌత్‌జోన్‌ పోటీలు, 27న జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లోనూ తమ విద్యార్థులు పాల్గొంటారని తెలిపారు.

Updated Date - 2022-11-08T00:42:41+05:30 IST

Read more