నాగుల చవితికి పటిష్ట ఏర్పాట్లు

ABN , First Publish Date - 2022-10-11T06:25:07+05:30 IST

ఈనెల 29 జరిగే నాగుల చవితి వేడుకలకు పటిష్ట ఏర్పాట్లు చేసి సమష్టి కృషితో విజయవంతం చేద్దామని ఈవో ఎన్‌.ఎ్‌స.చక్రధరరావు, తహసీల్దార్‌ కె.నవీన్‌ కుమార్‌ అన్నారు.

నాగుల చవితికి పటిష్ట ఏర్పాట్లు

మోపిదేవి, అక్టోబరు 10 : ఈనెల 29 జరిగే  నాగుల చవితి వేడుకలకు పటిష్ట ఏర్పాట్లు చేసి సమష్టి కృషితో విజయవంతం చేద్దామని ఈవో ఎన్‌.ఎ్‌స.చక్రధరరావు, తహసీల్దార్‌ కె.నవీన్‌ కుమార్‌ అన్నారు. దేవస్థానం కార్యాలయంలో సోమవారం వివిధ శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. స్వామివారికి నిర్వహించే పర్వదినాల్లో నాగుల చవితి మహోత్సవం ఎంతో విశిష్టమైనదన్నారు.  నాగపుట్టలో పాలుపోయటం, చిన్నారులకు కుట్టుపోగులు, చెవి పోగులు, అన్నప్రాశన వంటి కార్యక్రమాలకు లక్ష మందికిపైగా భక్తులు విచ్చేస్తారన్నారు.  సత్వరమే స్వామివారి దర్శనం కలిగేలా తెల్లవారుజామున 4 గంటలకుఆలయ ప్రవేశం కల్పిస్తారన్నారు. ప్రత్యేకమైన క్యూ లైన్లు, చిన్న పిల్లలకు పాలు, భక్తులకు మజ్జిగ, పులిహోర ప్రసా దం దేవస్థానం ఆధ్వర్యంలో ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. స్వచ్ఛంద సంస్థల సేవలు వినియోగించుకుంటామన్నారు.   అవనిగడ్డ ఆర్టీసీ డీఎం హనుమంతరావు, వీఆర్వోలు మూర్తి, శ్రీనివాస్‌, అగ్నిమాపక, పంచాయతీరాజ్‌ శాఖ ఉద్యోగులు పాల్గొన్నారు.  

Read more