విపక్ష నేతలతో ఎమ్మెల్యే వసంత

ABN , First Publish Date - 2022-09-17T06:56:18+05:30 IST

విపక్ష నేతలతో ఎమ్మెల్యే వసంత

విపక్ష నేతలతో ఎమ్మెల్యే వసంత
అమెరికాలో బీజేపీ, టీడీపీ నేతలతో ఎమ్మెల్యే వసంత

ఇబ్రహీంపట్నం, సెప్టెంబరు 16: అమెరికాలో బీజేపీ, టీడీపీ నేతలతో వైసీపీ మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్‌ దిగిన ఫొటో శుక్రవారం హల్‌చల్‌ చేసింది. కొంత కాలంగా వసంత పార్టీ మారనున్నారనే ప్రచారానికి ఇది ఆజ్యం పోసింది. మూడు నెలల క్రితం వసంత అమెరికా పర్యటన చేశారు. ‘గడప గడపకు’ కార్యక్రమాన్ని చేపట్టాలని వైసీపీ అది ష్టానం ఆదేశించినా లెక్కచేయకుండా అమెరికా వెళ్లారు. తర్వాత మరలా ఈ నెలలో వెళ్లారు. శుక్రవారం బీజేపీ నిజా మాబాద్‌ ఎంపీ ధర్మపురి అరవింద్‌, టీడీపీ రాజమండ్రి రూరల్‌ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి, తానా మాజీ అధ్యక్షుడు ఈమని సతీష్‌, టీడీపీ గుంటూరు నేత మన్నెం సుబ్బారావును కలవడంలో ఆంతర్యమేంటని పలువురు చర్చించుకుంటున్నారు. పార్టీ మార్పునకు సంకేతమా అంటున్నారు. కొన్నాళ్లుగా వైసీపీ లోని ఓ వర్గం వసంత పార్టీ మారతారనే ప్రచారం చేస్తోంది.Read more