టీడీపీ గెలుపే ధ్యేయంగా పని చేయాలి

ABN , First Publish Date - 2022-06-12T06:59:08+05:30 IST

రాబోయే ఎన్నికలు రాష్ట్ర భవితకు కీలకమైనవని, ఈ ఎన్నికల్లో గెలుపే ధ్యే యంగా కార్యకర్తలు పనిచేయాలని గుడివాడ మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు అన్నారు.

టీడీపీ గెలుపే ధ్యేయంగా పని చేయాలి

  కార్యకర్తలకు రావి వెంకటేశ్వరరావు పిలుపు

అవనిగడ్డ టౌన్‌  : రాబోయే ఎన్నికలు రాష్ట్ర భవితకు కీలకమైనవని, ఈ ఎన్నికల్లో గెలుపే ధ్యే యంగా కార్యకర్తలు పనిచేయాలని గుడివాడ మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు అన్నారు. అవనిగడ్డ నియోజకవర్గం బూత్‌ కమిటీ క్లస్టర్‌ వలంటీర్ల అవగాహన కార్యక్రమం శనివారం సాయంత్రం జరిగింది.  ముఖ్యఅతిథిగా  రావి వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. రాబోయే ఎన్నికల్లో గెలుపు కోసం వైసీపీ ఎంతకైనా తెగిస్తుందని హెచ్చరించారు. ఎన్నికలను ప్రతి కార్యకర్త ఉద్యమంగా భావించి పార్టీ గెలుపు కోసం పనిచేయాలన్నారు.  పొత్తులతో సంబంధం  లేకుం డానే పార్టీ బూత్‌ కమిటీ సభ్యు లు, క్లస్టర్‌ వాలంటీర్లు, అనుబంధ సంఘాల నేతలు పనిచేయాలని ఆయన సూచించారు.  నియోజకవర్గంలో పార్టీ నేతలు ఎదుర్కొంటున్న పలు సమస్యలను పార్టీ నేతలు రావి వెంకటేశ్వరరావుకు వివరించి అధినేత దృష్టికి తీసుకెళ్లాలని కోరారు.  నియోజకవర్గ పరిశీలకులు నల్లపాటి రామచంద్ర ప్రసాద్‌, జిల్లా పార్టీ ఉపాధ్యక్షులు మండలి వెంకట్రామ్‌ (రాజా), జిల్లా అధికార ప్రతినిధి కొల్లూరి వెంకటేశ్వరరావు, ఆరు మండలాల  క్లస్టర్ల బాధ్యులు, మండల కమిటీ ముఖ్యులు, సమన్వయ కమిటీ నేతలు పాల్గొన్నారు.  

Read more