ఏమ్మా.. కాసేపు కూర్చోలేరా..!

ABN , First Publish Date - 2022-10-02T06:04:26+05:30 IST

ఏమ్మా.. కాసేపు కూర్చోలేరా..!

ఏమ్మా.. కాసేపు కూర్చోలేరా..!
పెడనలో మహిళలను బెదిరిస్తున్న మంత్రి జోగి రమేశ్‌

వైఎస్సార్‌ చేయూత సభలో మంత్రి జోగి రమేశ్‌ వ్యాఖ్యలు

మహిళలను కించపరిచేలా మాటలు


ఆంధ్రజ్యోతి-మచిలీపట్నం : రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేశ్‌ తీరుపై విమర్శలు వెల్లువెత్తున్నాయి. పెడన పురపాలక సంఘ కార్యాలయం ఎదురుగా ప్రధాన రహదారిపై శుక్రవారం వైఎస్సార్‌ చేయూత లబ్ధిదారులతో ఆయన సమావేశం ఏర్పాటు చేశారు. ఎప్పటిలాగే టీడీపీ, జనసేనపై విమర్శలు గుప్పించారు. ఆ సమయంలో నలుగురు మహిళలు సమావేశం నుంచి బయటకు వెళ్తుండటాన్ని ఆయన గమనించారు. ఆగ్రహంతో ఊగిపోయారు. పక్కనే ఉన్న మహిళలను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ ‘అక్కా.. ఈ నలుగురి పేర్లు రాసుకోండి. వారు ఏ వార్డు వారో తెలుసుకోండి. ఏమమ్మా.. పది నిమిషాలు కూర్చోలేకపోతున్నారా, మీకోసమే కదా ఇదంతా చేసేది. వారి పేర్లు రాసుకోండి.’ అంటూ కోపంగా మాట్లాడారు. దీంతో కార్యక్రమంలోని  మహిళలు విస్మయం వ్యక్తం చేశారు. మహిళలు ఏ కారణంతో సమావేశం నుంచి బయటకు వెళ్తున్నారో గమనించకుండా మంత్రి ఏకంగా మైకులో వారిని బెదిరించడంతో అక్కడున్న వారంతా ఆశ్చర్యానికి గురయ్యారు. మంత్రి పదవి పొందాక దురుసుగా వ్యవహరించడం ఏమిటని మండిపడ్డారు.


Read more