ఇంద్రకీలాద్రిపై మంత్రి పర్యటన

ABN , First Publish Date - 2022-05-24T20:49:06+05:30 IST

పార్కింగ్, అన్న ప్రసాదం, ప్రసాదం భవనాల పనులను పరిశీలించారు. ఆలయ అభివృద్ధికి మాస్టర్ ప్లాన్ తయారవుతుందన్నారు. ప్లాన్‌ను అంగీకరించిన వెంటనే పనులు

ఇంద్రకీలాద్రిపై మంత్రి పర్యటన

విజయవాడ: ఇంద్రకీలాద్రి, కనకదుర్గా నగర్‌లో దేవాదాయశాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ పర్యటించారు. పార్కింగ్, అన్న ప్రసాదం, ప్రసాదం భవనాల పనులను పరిశీలించారు. ఆలయ అభివృద్ధికి మాస్టర్ ప్లాన్ తయారవుతుందన్నారు. ప్లాన్‌ను అంగీకరించిన వెంటనే  పనులు వేగవంతం చేస్తామన్నారు. అభివృద్ధి పనులకు నిధుల  కొరత లేదన్నారు. ఘాట్ రోడ్డులో రాకపోకలు తగ్గిస్తున్నామని, భక్తులు,  వీవీఐపీలు మహామండపంలోని రాజగోపురం ద్వారా దర్శించుకొనేలా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. అర్జునుడు తపస్సు చేసిన ఇంద్రకీలాద్రి కొండపై భాగానికి మెట్లు వేసి వ్యూ పాయింట్‌గా మారుస్తామన్నారు.  త్వరలోనే ఘాట్లలో పుణ్య స్నానాలకు భక్తులకు అనుమతిస్తామన్నారు. వేసవి  దృష్ట్యా భక్తులకు ఇబ్బంది లేకుండా చలువ పందిళ్ల వేయాలని ఆదేశించామన్నారు. మంత్రి వెంట ఎండోమెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ అనిల్ సింఘాల్, కమిషనర్ హరి జవహర్ లాల్, దుర్గగుడి ఈవో భ్రమరాంబ ఉన్నారు. 

Read more