మధ్యాహ్న భోజన పథకం వర్కర్ల ఆందోళన

ABN , First Publish Date - 2022-09-13T07:08:03+05:30 IST

మధ్యాహ్న భోజన పథకం వర్కర్లకు జీతాలు పెంచాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని కోరుతూ భోజన పథకం వర్కర్ల సంఘం అధ్యక్షురాలు ఎం.లక్ష్మి సోమవారం ఎంఈవో దుర్గాప్రసాద్‌కు వినతిపత్రం సమర్పించారు.

మధ్యాహ్న భోజన పథకం వర్కర్ల ఆందోళన

మచిలీపట్నం టౌన్‌ :  మధ్యాహ్న భోజన పథకం వర్కర్లకు జీతాలు పెంచాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని కోరుతూ   భోజన పథకం వర్కర్ల సంఘం అధ్యక్షురాలు ఎం.లక్ష్మి సోమవారం ఎంఈవో దుర్గాప్రసాద్‌కు వినతిపత్రం సమర్పించారు. సోమవారం సంఘ నాయకులు ఎంఈవోను కలసి సమస్యలను వివరించారు.   సమస్యలను పరిష్కరించని పక్షంలో ఈనెల 20వ తేదీన కలెక్టరేట్‌ వద్ద ధర్నా నిర్వహిస్తామని ఎంఈవోకు నోటీసు అందచేశారు. ఈ కార్యక్రమంలో సంఘ కార్యదర్శి మురళి, పద్మ, జ్యోతి, వెంకటేశ్వరమ్మ తదితరులు పాల్గొన్నారు. పెడన : తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ మధ్యాహ్న భోజన పథక కార్మికులు సోమవారం స్థానిక తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట ధర్నా చేశారు.    కనీస వేతనం రూ. 26 వేలు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. మండల మధ్యాహ్న భోజన వర్కర్స్‌ యూనియన్‌ అధ్యక్షురాలు రాజారాత్నం, కార్యదర్శి రాజకుమారి, కోశాధికారి సరస్వతి తదితరులు పాల్గొన్నారు. 

Read more