మెడికల్‌ డిస్ట్రిబ్యూటర్‌ అరెస్టు?

ABN , First Publish Date - 2022-11-08T01:03:13+05:30 IST

పరిచయం ఉన్న వారి నుంచి క్రెడిట్‌ కార్డులు తీసుకుని, వాటిని ఉపయోగించుకుని ముఖం చాటేసిన ధనలక్ష్మి మెడికల్‌ డిస్ట్రిబ్యూటర్‌ కార్తీక్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం.

మెడికల్‌ డిస్ట్రిబ్యూటర్‌ అరెస్టు?

విజయవాడ, నవంబరు 7(ఆంధ్రజ్యోతి) : పరిచయం ఉన్న వారి నుంచి క్రెడిట్‌ కార్డులు తీసుకుని, వాటిని ఉపయోగించుకుని ముఖం చాటేసిన ధనలక్ష్మి మెడికల్‌ డిస్ట్రిబ్యూటర్‌ కార్తీక్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం. దుర్గాపురం సాంబమూర్తి రోడ్డులో ధనలక్ష్మి మెడికల్‌ అండ్‌ ఫ్యాన్సీ డిస్ట్రిబ్యూటర్‌ అధినేత కార్తీక్‌ చుట్టుపక్కల వారిని పరిచయం చేసుకుని క్రెడిట్‌ కార్డులు తీసు కున్న విషయం తెలిసిందే. వాటిపై రుణాలు తీసుకుని, చెల్లిస్తానని చెప్పి పరార య్యాడు. 18 మంది నుంచి రూ.2కోట్ల వరకు రుణాలు తీసుకున్నారని సమాచారం. సూర్యారావుపేట పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారని తెలిసింది.

Updated Date - 2022-11-08T01:03:13+05:30 IST

Read more