-
-
Home » Andhra Pradesh » Krishna » matti ganapathulanee-NGTS-AndhraPradesh
-
మట్టి గణపతులనే పూజించాలి
ABN , First Publish Date - 2022-08-31T06:35:46+05:30 IST
మట్టి గణపతులనే పూజించాలి

మైలవరం, ఆగస్టు 30 : పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ మట్టి గణపతులనే పూజించాలని ఎల్బీఆర్సీఈ ప్రిన్సిపల్ డాక్టర్ కె.అప్పారావు సూచించారు. ఏఐసీటీఈ సహకారంతో ప్రకృతి క్లబ్, ఎన్ఎ్సఎస్ యూనిట్ ఆధ్వర్యంలో మైలవరం పట్టణంలో మట్టి గణపతులను పంపిణీ చేశారు. మైలవరంలోని డాక్టర్ లకిరెడ్డి హనిమిరెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఇళ్ల రవి ఆదేశాల మేరకు మంగళవారం పట్టణంలో మట్టి వినాయకుల ప్రతిమలను పంపిణీ చేశారు. ఇబ్రహీంపట్నం : వినాయక చవితి వేడుకలు మంగళవారం డీఏవి పాఠశాలో ఘనంగా నిర్వహిం చారు. ప్రిన్సిపాల్ కె.శ్రీనివాస్ ఆధ్వర్యంలో విద్యార్థులు పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిం చారు. లయన్స్ క్లబ్ విజయవాడ వీఆర్కే నగర మహిళ ఆధ్వర్యంలో కొండపల్లిలో వినాయ మట్టి ప్రతిమలు ఉచితంగా పంపిణీ చేశారు. పెనుగంచిప్రోలు : శ్రీ చైతన్య స్కూల్లో వినాయక చవితి వేడుకలను మంగళవారం ఘనంగా నిర్వహించారు. జగ్గయ్యపేట : వినాయక చవితి సందర్భంగా పట్టణంలో పాత మునిసిపల్ ఆఫీసు వద్ద విమ లాభాను పౌండేషన్ చైర్మన్ సామినేని విమలా భాను మునిసిపల్ చైర్మన్ రంగాపురం రాఘవేంద్రతో కలిసి పంపిణి చేశారు. ఎస్జీఎస్ కళాశాలలో ఎం.శ్రీనివాస్ మట్టి వినాయక విగ్రహాలను పంపిణీ చేశారు. నందిగామ రూరల్ : పర్యావరణ సమితి, వాసవీ క్లబ్ ఆధ్వర్యంలో మట్టి వినాయకుని ప్రతిమలను ఉచితంగా పంపిణీ చేశారు.