మంత్రి నాగార్జున వ్యాఖ్యలపై టీడీపీ ఆగ్రహం

ABN , First Publish Date - 2022-09-17T06:45:10+05:30 IST

మంత్రి నాగార్జున వ్యాఖ్యలపై టీడీపీ ఆగ్రహం

మంత్రి నాగార్జున వ్యాఖ్యలపై టీడీపీ ఆగ్రహం

అవనిగడ్డ టౌన్‌, సెప్టెంబరు 16 : మంత్రి మేరుగ నాగార్జున వ్యాఖ్యలకు నిరసనగా టీడీపీ ఆధ్వర్యంలో స్థానిక రాజీవ్‌గాంధీ సెంటర్‌లో నిరసన కార్యక్రమాన్ని శుక్రవారం సాయంత్రం చేపట్టారు. ఈ సందర్భంగా టీడీపీ ఎస్సీ సెల్‌ ప్రధాన కార్యదర్శి కర్రా సుధాకర్‌ మాట్లాడుతూ, గురువారం అసెంబ్లీలో టీడీపీ ఎమ్మెల్యే బాలవీరాంజనేయస్వామిని మంత్రి మేరుగు నాగార్జున నీవు నిజంగా దళితులకు పుడితే తెలుగుదేశం పార్టీ నుంచి బయటకు రావాలనటం సిగ్గుచేటని, తన సాటి కులస్థుడైన ఎమ్మెల్యే పుట్టుకను, కులాన్ని అవమానపర్చిన మంత్రిని వెంటనే మంత్రి మండలి నుంచి బర్త్‌రఫ్‌ చేయాలని డిమాండ్‌ చేశారు.  వైసీపీ ప్రభుత్వం అధికా రంలోకి వచ్చిన తర్వాత దళితుల మీద దాడులు, అత్యాచారాలు పెరిగిపోయాయని, వీటిని అరికట్టడంలో ప్రభుత్వం విఫమైందని దుయ్యబట్టారు. దళితులు మీకు ఓట్లు వేసిన పాపానికి ఎంతో మంది దళితులను బలిగొన్నారన్నారు. ఇప్పటికైనా మంత్రి మేరుగు నాగార్జున యావత్‌ దళిత జాతికి క్షమాపణ చెప్పాలని, మంత్రి వర్గం నుంచి అతన్ని బర్త్‌రఫ్‌ చేయాలని, లేకపోతే వైసీపీని బంగాళాఖాతంలో కలుపుతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు  యాసం చిట్టిబాబు, గాజుల మురళీకృష్ణ, నాగాయలంక మండల తెలుగు యువత అధ్యక్షుడు మేడికొండ విజయ్‌, బండే రాఘవ, లుక్కా శ్రీను, మెగావత్‌ గోపి, గాలం శ్రీను, విశ్వనాధుని మురళీ, బచ్చు రఘునాథ్‌, రేపల్లె అంకినీడు, మేరుగు సోమిరెడ్డి, లింగం బాబూరావు, చెన్ను బాబూరావు, గాంధీ తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-09-17T06:45:10+05:30 IST