మహిషాసురమర్దనిగా అమ్మవారి దర్శనం

ABN , First Publish Date - 2022-10-05T07:53:22+05:30 IST

దేవి నవరాత్రోత్సవాల్లో భాగంగా మంగళవారం మహిషాసురమర్దని అలంకారంలో అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు.

మహిషాసురమర్దనిగా అమ్మవారి దర్శనం

జగ్గయ్యపేట, అక్టోబరు 4 : దేవి నవరాత్రోత్సవాల్లో భాగంగా మంగళవారం మహిషాసురమర్దని అలంకారంలో అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. దుర్గాపురంలో దుర్గాదేవి అమ్మవారు, రేణుక పరమేశ్వరి అమ్మవారు, ఈశ్వరీ దేవి అమ్మవారు, కన్యక పరమేశ్వరీ అమ్మవారు, మహాలక్ష్మీ అమ్మవారి వెండి దేవాలయంలో మహిషాసురమర్దని దేవిగా దర్శనమిచ్చారు. భక్తులు అధికంగా పాల్గొని పూజలు చేశారు.

అన్నసమారాధనలు

ఎన్‌ఎస్పీ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన దుర్గాదేవి మండపం వద్ద అన్నసమారాధనను మాజీ ఎమ్మెల్యే శ్రీరాం తాతయ్య ప్రారంభించారు. తొలుత ఆయన అమ్మవారిని దర్శించుకుని పూజలు నిర్వహించారు. ఆయన వెంట గుత్తా సురేష్‌, సీహెచ్‌ రమే్‌ష పాల్గొ న్నారు. 

వెండి దేవాలయం కమిటీ ఆధ్వర్యంలో..

కన్యకా పరమేశ్వరి కల్యాణ మండపంలో దేవి శరన్నవరాత్రోత్సవాల సందర్భంగా మంగళవారం భారీ అన్నసమారాధన నిర్వహించారు. భక్తులు వందలాదిగా తరలివచ్చి అన్న ప్రసాదాన్ని స్వీకరించారు. ప్రభుత్వ విప్‌ సామినేని ఉదయభాను, ఆకుల బాజీ హాజరైయ్యారు. 

మండపాలను దర్శించిన విప్‌ ఉదయభాను

పట్టణంలో యాదవబజార్‌లో యువత ఏర్పాటు చేసిన కనకదుర్గ అమ్మవారి మండపాన్ని ప్రభుత్వ విప్‌ సామినేని ఉదయభాను దర్శించుకుని అన్నదానాన్ని ప్రారంభించారు. మునిసిపల్‌ మాజీ చైర్మన్‌ ఇంటూరి చిన్నా పాల్గొన్నారు. శాంతినగర్‌లో ఏర్పాటుచేసిన దుర్గాదేవి మండపంలోనూ ఉదయభాను పూజలు చేశారు. ఆకుల బాజీ పాల్గొన్నారు.

అమ్మవారిని దర్శించుకున్న సీఐ

పెనుగంచిప్రోలు : గ్రామాల్లో శాంతి భద్రతలకు విఘా తం కల్పించేందుకు ఎవ రైనా ప్రయత్నిస్తే కఠిన చర్యలు తీసు కుంటామని జగ్గయ్యపేట నూతన సీఐ అడపా నాగమురళి హెచ్చరించారు. ఇటీవల సీఐగా బాధ్యతలు స్వీకరించిన నాగమురళి మంగళవారం తిరుపతమ్మ అమ్మవారిని దర్శించుకుని పూజలు చేశారు. దర్శనానంతరం వేద పండితులు నాగమురళికి ఆశీర్వచనం చేయగా చైర్మన్‌ ఇంజం చెన్నకేశవరావు శేషవస్త్రం, ప్రసాదాలను అందజేశారు. ముందుగా సీఐ స్థానిక పో లీస్‌ స్టేషన్‌ సందర్శించారు. ఎస్సై ఎ.హరిప్రసాద్‌ పాల్గొన్నారు.

కొబ్బరిచిప్పలో దుర్గాదేవి చిత్రం

స్థానిక కళాకారులు ఏసీ శేఖర్‌ కొబ్బరిచిప్పలో దుర్గాదేవి అమ్మవారి చిత్రాన్ని గీశారు. విజయదశమి సందర్భంగా అమ్మవారికి ఇలా కళానైవేథ్యాన్ని సమర్పించారు. 

నందిగామ రూరల్‌లో...

నందిగామ రూరల్‌ : దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగం గా జగన్మాత మహిషాసురమర్దనిగా దర్శనమిచ్చింది. మండలంలోని అంబారుపేట గ్రామంలో వేంచేసియున్న సత్యమ్మ అ మ్మవారి ఆలయంలో ఈవో నాగరాజు, చైర్మన్‌ శ్రీనివాసరావు పర్యవేక్షణలో వేదపండితులు అమ్మవారికి మహిషాసు రమర్దనిగా అలంకరించి పూజలు చేశారు. మహిళలు అమ్మవా రి ఉగ్రరూపం శాంతించాలని గండదీపాలతో మేళతాళాలతో అ మ్మవారి ఆలయానికి చేరుకుని హారతులిచ్చారు. పల్లగిరి గట్టు త్రిశక్తి పీఠంలో త్రిమాతలకు, లింగాలపాడు లక్ష్మీపేరంటాళ్ల అ మ్మవారి ఆలయంలో అమ్మవారికి, పట్టణంలోని సుశశ్యామలాంబ అమ్మవారు, వాసవీ కన్యకాపరమేశ్వరీ అమ్మవారు. మరి డీ మహాలక్ష్మీ అమ్మవార్లను మహిషాసురమర్దనిగా అలంకరిం చి పూజలు చేశారు. భక్తులు పాల్గొని పూజల చేశారు. లింగాలపాడులో మహిళలు బతుకమ్మలాడి పూజలు చేశారు. 

వత్సవాయిలో...

వత్సవాయి : వత ్సవాయిలో కన్యకాపరమేశ్వరి అమ్మవారి దేవస్థానం, మంగోల్లులో మంగళవారం అమ్మవారు మహిషాసురమర్దనిగా దర్శనమిచ్చారు. మంగోల్లులో దసరా ఉత్సవాల సందర్భంగా గ్రామ ప్రముఖులు మన్నె నారాయణరావు ఆధ్వర్యంలో అన్నదానం జరగ్గా, ప్రజలు భారీగా హాజరయ్యారు. కంభంపాడులో రామాలయం వద్ద ఏర్పాటు చేసిన దుర్గా మండపం వద్ద తెలుగుదేశం పార్టీ నిర్వహించిన అన్నదానాన్ని మాజీ ఎమ్మెల్యే శ్రీరాం తాతయ్య ప్రారంభించారు. వడ్లమూడి రాంబాబు, ఉత్సవ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

పెనుగంచిప్రోలులో...

పెనుగంచిప్రోలు : మండలంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. స్థానిక గంగా పార్వతీ సమే త స్వయంభు శంభులింగేశ్వర స్వామి దేవస్థానంలో మంగళవారం పెద్ద ఎత్తున భక్తులకు అన్నదానం చేశారు. అర్చకుడు రేలంకి భాస్కరశర్మ ఆధ్వర్యంలో భక్తుల సహకారంతో ఈ అన్నదానం నిర్వహించారు. శ్రీ అయ్యప్ప సేవా సమితి అధ్యక్షుడు వాసిరెడ్డి బెనర్జీ ఏర్పాట్లను పర్యవేక్షించారు. పడమర బజారు దుర్గామల్లేశ్వర ఉత్సవ కమిటీ పందిరి వద్ద అమ్మవారు మహిషాసురమర్దని అవతారంలో భక్తులకు దర్శనిమిచ్చారు. 

Updated Date - 2022-10-05T07:53:22+05:30 IST