మహిళల సమస్యలపై ఉద్యమించాలి

ABN , First Publish Date - 2022-09-08T06:13:41+05:30 IST

మహిళల సమస్యలపై ఉద్యమించాలి

మహిళల సమస్యలపై ఉద్యమించాలి
సమావేశంలో మాట్లాడుతున్న జ్యోతి

 కంకిపాడు, సెప్టెంబరు 7 : దేశంలో మహిళలు ఎదుర్కొంటున్న సమస్య లపై ఉద్యమించాల్సిన అవసరముందని ఐద్వా జిల్లా కార్యదర్శి జ్యోతి అన్నారు. కంకిపాడులోని మండేపూడి నాగభూషన్‌ రెడ్డి భవన్‌లో బుధవారం నిర్వహించిన ఐద్వా మహాసభలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా జ్యోతి మాట్లాడుతూ, దేశంలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందన్నారు. రోజు రోజుకు మహిళలపై దాడులు జరుగుతున్నా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహ రిస్తున్నాయని మండిపడ్డారు. 2002 గుజరాత్‌ అల్లర్లు మారణహోమం సృష్టించిన 15 మంది దోషులను స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా విడుదల చేయడం హేయమైన చర్య అన్నారు.  ఉషారాణి సభాధ్యక్షత వహించిన ఈ సమావేశంలో కుమారి, ఉమా దివ్య తదితరులు పాల్గొన్నారు. 

Read more