మహాత్ముల త్యాగ ఫలితమే స్వాతంత్య్రం

ABN , First Publish Date - 2022-08-15T06:45:29+05:30 IST

మహాత్ముల త్యాగ ఫలితమే స్వాతంత్య్రం

మహాత్ముల త్యాగ ఫలితమే స్వాతంత్య్రం

ఏపీఎస్‌ ఆర్టీసీ విజయవాడ జోన్‌ ఎగ్జిక్యూటీవ్‌ డైరెక్టర్‌ గిడుగు వెంకటేశ్వరరావు 

గన్నవరం, ఆగస్టు 14: మహాత్ముల త్యాగాల ఫలితమే స్వాతంత్య్రం లభించిం దని ఏపీఎస్‌ ఆర్టీసీ విజయవాడ జోన్‌ ఎగ్జిక్యూటీవ్‌ డైరెక్టర్‌ గిడుగు వెంకటేశ్వరరావు అన్నారు. స్థానిక ఆర్టీసీ డిపోలో ఆజాదికా అమృత్‌ మహోత్సవ్‌ సందర్భంగా బస్‌ స్టేషన్‌ పైన, గ్యారేజ్‌పైన ఆర్టీసీ ప్రాంగణంలో జాతీయ జెండాలు, తోరణాలతో అలంకరించగా ఆదివారం ఈడీ వెంకటేశ్వరరావు, జిల్లా ప్రజా రవాణాధికారి గద్దె నాగేశ్వరావు పరిశీలించారు. డిపో మేనేజర్‌ పి.శివాజీ, సూపర్‌ వైజర్‌లు పాల్గొన్నారు. 

హనుమాన్‌జంక్షన్‌  : ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌లో భాగంగా ఆదివారం నారాయణ స్కూల్‌ విద్యార్థులు 300 మీటర్ల భారీ జెండాతో ప్రదర్శన నిర్వహించారు. ఆ స్కూల్‌ ఏజీఎం అనిల్‌కుమార్‌, ఆర్‌ఐ సత్తిరెడ్డి, ప్రిన్సిపాల్‌ ప్రవీణ్‌కుమార్‌ ఆధ్వర్యంలో పాఠశాల విద్యార్ధులు స్కూల్‌ నుంచి ర్యాలీ ప్రారంభించి జంక్షన్‌ నాలు గు రోడ్ల కూడలిలో మానవహారం నిర్వహించారు. కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ సభ్యుడు సుంకర సుభాష్‌ చంద్రబోస్‌, జనసేన నాయకులు చలమలశెట్టి రమేష్‌ బాబు, ట్రాన్స్‌పోర్టర్‌ కనుమూరి శివాజీరాజా, వైస్‌ ప్రిన్సిపాల్స్‌ కె.లలితభవాని, కె.హర్షవీణ, డీన్‌ దుర్గాశంకర్‌, ఏవో శ్యామ్‌ ప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు. 

ఫ అజాదీకా అమృత్‌ మహోత్సవ్‌లో భాగంగా టీడీపీ అధినేత చంద్రబాబు ఆదేశాలు మేరకు బాపులపాడుమండలం కె.సీతారాంపురంలో టీడీపీ జిల్లా నేత చెన్నుబోయిన శివయ్య ఆధ్వర్యంలో ఆదివారం జెండా ఆవిష్కరించారు. అనంతరం అజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌ ర్యాలీ నిర్వహించారు. కార్యక్ర మంలో టీడీపీ నాయకులు చెన్నుబోయిన నాగరాజు, చౌటుపల్లి చిరంజీవి, అచ్చెన వెంకటేశ్వరరావు, చౌటుపల్లి భాగ్యరాజు, కంచనపల్లి రామారావు తదితరులు పాల్గొన్నారు.

పెనమలూరు  :   పోరంకిలోని చిగురుపాటి శ్రీకృష్ణవేణి పాఠశాల విద్యార్థులు, ఉపాధ్యాయులు ఇంటింటికీ వెళ్లి జాతీయ జెండాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో డైరెక్టరు చంద్రశే ఖరరావు, ప్రిన్సిపాల్‌ మాధవి పాల్గొన్నారు.

ఉయ్యూరు : ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌ లో భాగంగా ఆదివారం ఉయ్యూరు పట్టణ, మం డల పరిధి గ్రామాల్లో జాతీయ పతాకం గాలిలో రెపరెపలాడింది. ఏజీఅండ్‌ఎ్‌సజీఎస్‌ కళాశాల వాకర్స్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో వర్షం సైతం లెక్కచేయక తిరంగా ర్యాలీ నిర్వహించి దేశభక్తి చాటుకుంటున్నారు. కళాశాల ట్రాక్‌ వద్ద నుంచి ప్రధాన రోడ్లలో వర్షంలోను   ర్యాలీ నిర్వహించి దేశభక్తి నినాదాలతో  హోరెత్తించారు. అసోసి యేషన్‌ అధ్యక్షుడు ఎస్‌. తిరుమలరావు జెండాఊపి ర్యాలీ ప్రారంభించారు. సెక్రటరీ రాంబాబు, సత్యకిషోర్‌ , కోటేశ్వరరావు, బాపిరాజు, రాము, రాజు తదితరులు పాల్గొన్నారు. 

Read more