లోటస్‌పాండ్‌కు నీ తండ్రి పేరు పెట్టలేదేం

ABN , First Publish Date - 2022-09-24T06:31:17+05:30 IST

ఎన్టీఆర్‌ హెల్త్‌ యూనివర్సీటి పేరు మార్చటంపై మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఆగ్రహం వ్యక్తం చేశారు.

లోటస్‌పాండ్‌కు నీ తండ్రి పేరు పెట్టలేదేం
సాంబశివరావుతో దీక్ష విరమింపజేస్తున్న ఉమా, సౌమ్య

దేవినేని ఉమా ధ్వజం

నందిగామ, సెప్టెంబరు 23: ఎన్టీఆర్‌ హెల్త్‌ యూనివర్సీటి పేరు  మార్చటంపై మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. నందిగామ టీడీపీ కార్యాలయంలో విజయవాడ పార్లమెంట్‌ ఉపాధ్యక్షుడు వడ్డెల్లి సాంబశివరావు దీక్ష విరమణలో మాజీ ఎమ్మెల్యే సౌమ్యతో కలిసి దీక్షను విరమింపజేశారు. ఈ సందర్భంగా ఉమా మాట్లాడుతూ జగన్‌ సొంత ఆస్తులు లోటస్‌పాండ్‌, సాక్షి పత్రిక , భారతీ సిమెంట్స్‌, సండూరు పవర్‌లకు తండ్రి పేరు ఎందుకు పెట్టుకోలేదని ప్రశ్నించారు. ఎన్టీఆర్‌కు, వైఎస్‌కు పొంతన ఏమిటని ప్రశ్నించారు. ఎన్టీఆర్‌ పేరు తిరిగి పెట్టే వరకు ఆందోళన కొనసాగుతుందన్నారు. 


 మోకాళ్లపై  కూర్చుని నిరసన

మైలవరం: ఎన్టీఆర్‌ హెల్త్‌ యూనివర్సిటీ పేరును యథావిధిగా కొనసాగించాలంటూ టీడీపీ మండల ఉపాధ్యక్షుడు మైక్‌ బాబూరావు శుక్రవారం నల్ల దుస్తులతో మోకాళ్లపై నిలబడి నిరసన తెలిపారు. నందమూరి తారక రామారావు తెలుగు జాతి ఆరాధ్యదైవమని, ఆయన పేరు తొలగించి ప్రజల గుండెల్లో దూరం చేయటం మీ వల్ల కాదన్నారు. 

Read more