-
-
Home » Andhra Pradesh » Krishna » Let stop using plastic-NGTS-AndhraPradesh
-
ప్లాస్టిక్ వాడకాన్ని మానేద్దాం
ABN , First Publish Date - 2022-09-19T06:15:44+05:30 IST
ప్లాస్టిక్ వాడకాన్ని మానేద్దాం

లబ్బీపేట, సెప్టెంబరు 18: పర్యావరణ పరి రక్షణకు అవరోధంగా ఉన్న ప్లాస్టిక్ వాడకాన్ని మానేయాలని, చెట్లను పెంచడంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని అశయ ఫౌండేషన్ విద్యార్థులు పిలుపునిచ్చారు. ఆదివారం బెంజిసర్కిల్ ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద ప్లకార్డులతో ప్లాస్టిక్ వాడకంతో వచ్చే అనర్థాలపై వారు అవగాహన కల్పించారు. ట్రాఫిక్ సిగ్నల్స్ పడిన వెంటనే ప్లకార్డులు ప్రదర్శించారు. వస్త్ర సంచులను వాహనదారులకు పంపిణీ చేశారు. నగరంలోని కళా శాలల విద్యార్థులు భార్గవి, అల్తఫ్, తేజ, దీరజ్, రాకేష్, గాయత్రి ప్రసాద్, ప్రవిణ్, సమ్రీన్, జైనాబ్ పాల్గొన్నారు.
