బంగారం షాపుల్లో తనిఖీలు

ABN , First Publish Date - 2022-12-13T00:55:31+05:30 IST

నగరంలోని వివిధ గోల్డ్‌ షాపులపై లీగల్‌ మెట్రాలజీ అధికారులు సోమవారం తనిఖీలు నిర్వహించారు. నగరంలోని పలు ప్రముఖ, సాధారణ షాపులపై ఆకస్మిక దాడులు నిర్వహించిన అధికారులు నిబంధనలు పాటించని ఏడు దుకాణాలపై కేసు లు నమోదు చేశారు.

బంగారం షాపుల్లో తనిఖీలు

పాయకాపురం, డిసెంబరు 12 : నగరంలోని వివిధ గోల్డ్‌ షాపులపై లీగల్‌ మెట్రాలజీ అధికారులు సోమవారం తనిఖీలు నిర్వహించారు. నగరంలోని పలు ప్రముఖ, సాధారణ షాపులపై ఆకస్మిక దాడులు నిర్వహించిన అధికారులు నిబంధనలు పాటించని ఏడు దుకాణాలపై కేసు లు నమోదు చేశారు. లీగల్‌ మెట్రాలజీ డిప్యూటీ కంట్రోలర్‌ ఏ.కృష్ణచైతన్య ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ తనిఖీల్లో లీగల్‌ మెట్రాలజీ చట్ట ఉల్లంఘనలో షార్ట్‌ గోల్డ్‌ వేమెంట్‌పై ఒక కేసు, నాన్‌ స్టాండర్డ్‌ వేయింగ్‌ ఇన్స్‌్ట్రమెంట్స్‌ ఉపయోగించడం వలన ఐదు కేసులు, మె టల్స్‌ అండ్‌ ప్రిషియస్‌ స్టోన్స్‌ నెట్‌ వెయిట్‌ డీటెయిల్స్‌, అమ్మకపు ధరను విడివిడి గా విధిగా బిల్లులో నమోదు చేయకపోవడంతో ఒక కేసు నమోదు చేశారు.

Updated Date - 2022-12-13T00:55:31+05:30 IST

Read more