దళితుల హక్కుల రక్షణకు కేవీపీఎస్‌ కృషి

ABN , First Publish Date - 2022-10-04T06:05:27+05:30 IST

దళితుల హక్కులు, చట్టాలను కాపాడటానికి కులవివక్షపోరాట సమితి కృషి చేస్తుందని కులవివక్ష పోరాట సమిటి (కేవీపీఎస్‌) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆండ్ర మాల్యాద్రి అన్నారు

దళితుల హక్కుల రక్షణకు కేవీపీఎస్‌ కృషి

దళితుల హక్కుల రక్షణకు కేవీపీఎస్‌ కృషి

మొగల్రాజపురం, అక్టోబరు 3: దళితుల హక్కులు, చట్టాలను కాపాడటానికి కులవివక్షపోరాట సమితి కృషి చేస్తుందని కులవివక్ష పోరాట సమిటి (కేవీపీఎస్‌) రాష్ట్ర  ప్రధాన కార్యదర్శి ఆండ్ర మాల్యాద్రి అన్నారు. కేవీపీఎస్‌ 24వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సోమవారం 7వ డివిజన్‌ బందిల దొడ్డి వద్ద కేవీపీఎస్‌ తూర్పు కార్యదర్శి క్రాంతికుమార్‌ అధ్వర్యంలో జెండా అవిష్కరణ జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దళితుల హక్కుల రక్షణకు ప్రజా సంఘాలన్నీ ఏకం కావాలని పిలుపునిచ్చారు. నాయకులు  నాగరాజు, కుమార్‌ దాసు, జాక్సన్‌, చిన్నారి,  దానియేలు, కిరణ్‌, విజయ్‌ తదితరులు పాల్గోన్నారు. 

Read more