-
-
Home » Andhra Pradesh » Krishna » krushi pattudhalathoo unnatha sthanam-NGTS-AndhraPradesh
-
కృషి, పట్టుదలతో ఉన్నతస్థానం
ABN , First Publish Date - 2022-08-17T06:54:04+05:30 IST
కృషి, పట్టుదలతో ఉన్నతస్థానం

మచిలీపట్నం టౌన్, ఆగస్టు 16 : పట్టుదల, కృషి ఉంటే ఎంతటి ఉన్నత స్థానానికైనా ఎదగవచ్చని మచిలీపట్నం న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు పుప్పాల ప్రసాద్ అన్నారు. నూతనంగా న్యాయమూర్తిగా పదవీ బాధ్యతలు స్వీకరించనున్న మారగాని మురళీ గంగాధరరావును మంగళవారం న్యాయవాదుల గుమాస్తాల సంఘం హాలులో ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు పుప్పాల ప్రసాద్ మాట్లాడుతూ, పట్టుదల, కృషితో అతి పేద కుటుంబం నుంచి వచ్చిన మురళీ గంగాధరరావు ఉన్నత స్థాయికి ఎదిగా రన్నారు. సీనియర్ సివిల్ జడ్జి కోర్టులో గుమాస్తాగా పనిచేస్తూ గంగాధర రావు న్యాయమూర్తి కావడం అభినందనీయం అన్నారు. న్యాయవాద గుమాస్తాల సంఘం అధ్యక్షుడు సింగరాజు రాజా శ్రీనివాస్, న్యాయవాదుల సంఘం ప్రధాన కార్యదర్శి చీలి ముసలయ్య, న్యాయవాదులు మాదివాడ వెంకట నరసింహారావు, ఎండి సులేమాన్, కె.గోపాలకృష్ణ, ఆంజనేయులు, గుమాస్తాల సంఘ నాయకులు పి.వి.ఫణికుమార్, టి.బాబూరావు, డి.నాగేశ్వరరావు, డొక్కు లక్ష్మణ స్వామి, రాం బాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గంగాధరరావు మాట్లాడుతూ, ఎంత ఉన్నత స్థానానికి ఎదిగినా మచిలీపట్నం న్యాయవాదులు, గుమాస్తాలను మరచిపోనన్నారు.