-
-
Home » Andhra Pradesh » Krishna » kotha hajaru photolapee techerss kusthi-NGTS-AndhraPradesh
-
కొత్త హాజరు ఫొటోలపై ఉపాధ్యాయుల కుస్తీ
ABN , First Publish Date - 2022-08-17T06:52:58+05:30 IST
కొత్త హాజరు ఫొటోలపై ఉపాధ్యాయుల కుస్తీ

గన్నవరం, ఆగస్టు 16: కొత్త హాజరు ఫొటోలు సబ్మిట్ కాక ఉపాధ్యాయులు ముప్పతిప్పలు పడ్డారు. ప్రభుత్వం కొత్తగా తీసుకువచ్చిన విధానం వల్ల ఉపాధ్యా యులు అష్టకష్టాలు పడాల్సి వచ్చింది. ఉపాధ్యాయులు ఆయా పాఠశాలలకు ఉదయం 8.40కే వచ్చారు. అప్పటి నుంచి ఎంత సేపు ప్రయత్నించిన ఫేషియల్ అటెండెన్స్ పడలేదు. మండలంలో 252 మంది ఉపాధ్యాయులు ఉన్నారు. పాఠశాలలకు వచ్చిన దగ్గర నుంచి ఫోన్‌తో అటెండెన్స్ వేసేందుకు ఎంతసేపు కుస్తీ పడిన అవలేదు. కొందరికీ మధ్యాహ్నం అటెండెన్స్ సబ్మిట్ అయ్యింది. సాయంత్రం అసలు ఎవరికీ సబ్మిట్ కాలేదు. మొత్తం మీద ఒక పూట 60 మందికి మాత్రమే అటెండెన్స్ సబ్మిట్ అయ్యింది. ఫేషియల్ అటెండెన్స్‌తో ఉపాధ్యాయులకు బీపీ పెరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు.