పంటలకు భారీగా నష్టం

ABN , First Publish Date - 2022-10-11T06:28:00+05:30 IST

భారీ వర్షాలకు ముంపునకు గురై తీవ్రంగా నష్టపోయిన వేరుశెనగ రైతులను ప్రభు త్వం ఆదుకోవాలని మాజీ మంత్రి, టీడీపీ పొలిట్‌ బ్యూరో సభ్యుడు కొల్లు రవీంద్ర, మాజీ డిప్యూటీ స్పీకర్‌, టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బూరగడ్డ వేదవ్యాస్‌ డిమాండ్‌ చేశారు.

పంటలకు భారీగా నష్టం

 రైతులను ప్రభుత్వం తక్షణం ఆదుకోవాలి : రవీంద్ర, వేదవ్యాస్‌

మచిలీపట్నం టౌన్‌, అక్టోబరు 10 :  భారీ వర్షాలకు ముంపునకు గురై తీవ్రంగా నష్టపోయిన వేరుశెనగ రైతులను ప్రభు త్వం ఆదుకోవాలని మాజీ మంత్రి, టీడీపీ పొలిట్‌ బ్యూరో సభ్యుడు కొల్లు రవీంద్ర, మాజీ డిప్యూటీ స్పీకర్‌, టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బూరగడ్డ వేదవ్యాస్‌ డిమాండ్‌ చేశారు. సోమవారం పెదపట్నం, తాళ్ళపాలెం తదితర ప్రాంతాల్లో దెబ్బతిన్న పంటలను వారు పరిశీలించారు. రైతులు భారీగా నష్టపోయారన్నారు. రైతులకు నష్టపరిహారం చెల్లించాలని కొల్లు రవీంద్ర, బూరగడ్డ వేదవ్యా్‌స డిమాండ్‌ చేశారు. తెలుగుదేశం అఽధికారంలో ఉన్నప్పుడు ప్రకృ తి వైపరీత్యాల వల్ల నష్టపోయిన రైతులకు చంద్రబాబు సర్వే చేయించి నష్టపరిహారం అందించేవారని కొల్లు రవీంద్ర అన్నారు. అదే రీతిలో వేరుశెనగ రైతులను ఆదుకోవాలని కోరారు

తరకటూరులో బాదుడేబాదుడు నిరసన

పెడన  : ప్రభుత్వం ప్రజలపై భారాలు మోపడాన్ని నిరసిస్తూ   తరకటూరులో సోమవారం బాదుడే బాదుడు నిరసన కార్యక్రమం నిర్వహించారు.  నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి కాగిత కృష్ణప్రసాద్‌ ఇంటింటికీ వెళ్లి వైసీపీ ప్రభుత్వ వైఫల్యా లను వివరించారు.  మండల టీడీపీ అధ్యక్షుడు పోతన స్వామి,  నాయకులు, కార్యకర్తలు  పాల్గొన్నారు.



Updated Date - 2022-10-11T06:28:00+05:30 IST