టిడ్కో గృహాలు ఎప్పుడిస్తారు?

ABN , First Publish Date - 2022-10-11T06:23:24+05:30 IST

పనుల్లేక, అద్దెలు చెల్లించలేక ఇబ్బందులు పడుతున్నామని, టిడ్కో ఇళ్లు, జగనన్న కాలనీల్లో ఇళ్లు ఎప్పుడు కట్టించి ఇస్తారని ఎమ్మెల్యే కొడాలి శ్రీవెంకటేశ్వరరావు(నాని)ని ప్రజలు ప్రశ్నించారు.

టిడ్కో గృహాలు ఎప్పుడిస్తారు?

   ఎమ్మెల్యే కొడాలి నానీని నిలదీసిన 33వ వార్డు ప్రజలు

గుడివాడటౌన్‌, అక్టోబరు 10 : పనుల్లేక, అద్దెలు చెల్లించలేక ఇబ్బందులు పడుతున్నామని,  టిడ్కో ఇళ్లు, జగనన్న కాలనీల్లో ఇళ్లు ఎప్పుడు కట్టించి ఇస్తారని ఎమ్మెల్యే కొడాలి శ్రీవెంకటేశ్వరరావు(నాని)ని ప్రజలు ప్రశ్నించారు.  33వ వార్డులో సోమవారం గడప గడపకు ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు.  టిడ్కో ఇళ్ల పత్రాలు ఇచ్చి, రిజిస్ట్రేషన్‌ అంటూ ప్రతి రోజూ తిప్పుతున్నారని,  ఇళ్లు ఎప్పుడు ఇస్తారంటూ మహిళలు ఎమ్మెల్యేను నిలదీశారు. వర్షాలు వల్ల డ్రెయినేజీ  పొంగి దోమలు విజృంభిస్తున్నాయని, బ్లీచింగ్‌ కూడా చల్లడం లేదంటూ ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు. తాగునీటి సమస్య పర్కిరించాలని కోరారు. డిసెంబరులో టిడ్కో గృహాలు సీఎం జగన్మోహనరెడ్డి చేతుల మీదుగా అందజేస్తామని లబ్ధిదారులకు ఎమ్మెల్యే కొడాలి నాని హామీ ఇచ్చారు.  వైసీపీ రాష్ట్రనేత దుక్కిపాటి శశిభూషణ్‌, పాలేటి చంటి, ఆసుపత్రి అభివృద్ధి కమిటీ చైర్మన్‌ ఎంవి.నారాయణరెడ్డి, భాస్కరరావు, నైనవరపు శేషుబాబు, వైసీపీ పట్టణ అధ్యక్షుడు గొర్ల శ్రీను తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-10-11T06:23:24+05:30 IST