అమరావతి రాజధానిని ఎవరూ కదల్చలేరు

ABN , First Publish Date - 2022-09-19T06:17:16+05:30 IST

అమరావతి రాజధానిని ఎవరూ కదల్చలేరని విజయవాడ ఎంపీ కేశినేని శ్రీనివాస్‌ (నాని) అన్నారు.

అమరావతి రాజధానిని ఎవరూ కదల్చలేరు

- విజయవాడ ఎంపీ కేశినేని శ్రీనివాస్‌ (నాని)

విద్యాధరపురం: అమరావతి రాజధానిని ఎవరూ కదల్చలేరని విజయవాడ ఎంపీ కేశినేని శ్రీనివాస్‌ (నాని) అన్నారు. అమరావతి ప్రాంత రైతుల మహాపాదయాత్రకు సంఘీభావంగా టీడీపీ ముస్లింలు నిర్వహించిన సంఘీభావ కారు ర్యాలీని ఆయన ఆదివారం కేశినేని భవన్‌ నుంచి ప్రారంభించారు. ఈ సందర్భంగా కేశినేని మాట్లాడుతూ, అమరావతి రాజధానిని కదల్చడం ఎవరి తరమూ కాదన్నారు. జగన్‌ ప్రభుత్వం సుప్రీం కోర్టుకు వెళ్లినా ప్రయోజనం లేదన్నారు. బీజేపీ కూడా అమరావతికి మద్దతు తెలుపుతోందన్నారు. రాజధాని విషయంపై పార్లమెంట్‌లో ప్రస్తావిస్తానని తెలిపారు. విభజన చట్టంలో ఒకే రాజధాని ఉందన్న విషయాన్ని గమనించాలన్నారు. సుప్రీంకోర్టులో జగన్‌కు వ్యతిరేకంగా తీర్పు వస్తుందన్నారు. రాష్ట్రంలో రోడ్లు బాగాలేవన్నారు. అమరావతి మాత్రమే ఏకైక రాజధానిగా ఉంటుందన్నారు. 

Read more