ఔషధ రంగంలో విస్తృత అవకాశాలు

ABN , First Publish Date - 2022-09-13T06:16:04+05:30 IST

ఔషధ రంగంలో విస్తృత అవకాశాలున్నట్లు కేఎల్‌ విశ్వవిద్యాలయం రసాయనశాస్త్ర అధ్యాపకుడు డాక్టర్‌ ఏ వెంకటేశ్వరరావు అన్నారు.

ఔషధ రంగంలో విస్తృత అవకాశాలు

ఔషధ రంగంలో విస్తృత అవకాశాలు

వన్‌టౌన్‌, సెప్టెంబరు 12 : ఔషధ రంగంలో విస్తృత అవకాశాలున్నట్లు కేఎల్‌ విశ్వవిద్యాలయం రసాయనశాస్త్ర అధ్యాపకుడు డాక్టర్‌ ఏ వెంకటేశ్వరరావు అన్నారు. కేబీఎన్‌ కళాశాలలో పీజీ రసాయన శాస్త్ర విభాగం ఆధ్వర్యంలో వైద్యరంగంలో లోహ సమ్మేళనాల పాత్ర అంశంపై సోమవారం సదస్సు జరిగింది. ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన మాట్లాడుతూ, జనాభా పెరుగుదలతో పాటు వ్యాధులు కూడా ప్రబలుతున్నాయన్నారు. వ్యాధుల నిర్మూలనకు వినియోగించే ఔషధాలలో రసాయనాల పాత్ర కీలకమన్నారు. ఫార్మా రంగంలో లోహ సమ్మేళనాలు ప్రాధాన్యత వహిస్తాయన్నారు. వీటిపై విద్యార్ధులు మరింత అవగాహన కల్పించుకోవాలన్నారు.ఇన్‌ఛార్జి ప్రిన్సిపాల్‌ ఎం వెంకటేశ్వరరావు, విభాగాధిపతి డాక్టర్‌ జి కృష్ణవేణి. కె కిరణ్‌కుమార్‌, విజయభాస్కర్‌ పాల్గొన్నారు.


Read more