-
-
Home » Andhra Pradesh » Krishna » kalyanamasthu kanuka andhajetha-NGTS-AndhraPradesh
-
కల్యాణమస్తు కానుక అందజేత
ABN , First Publish Date - 2022-09-08T06:15:12+05:30 IST
కల్యాణమస్తు కానుక అందజేత

హనుమాన్‌జంక్షన్, సెప్టెంబరు 7 : ఆరుగాలం కష్టపడి కృష్ణామిల్క్ యూనియన్‌కు పాలుపోస్తున్న రైతు కుటుంబాలకు కల్యాణమస్తు కానుక అంద జేయటం ఎంతో ఆనందంగా ఉందని విజయ డెయిరీ చైర్మన్ చలసాని ఆంజనే యులు అన్నారు. కల్మాణమస్తు పఽథకం కింద హనుమాన్‌జంక్షన్ పాలశీతల కేంద్రం క్లస్టర్ పరిధిలోని రంగన్నగూడెం మిల్క్ సొసైటీలో పాడిరైతు ఆళ్ల గోపా లకృష్ణ కుమార్తె సిరి చందన వివాహం సందర్భంగా బుధవారం రూ. 20 వేల విలువచేసే బంగారునాణెంను కానుకగా చలసాని అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ పాల సొసైటీ అధ్యక్షుడు మొవ్వా శ్రీనివాస రావు, టీడీపీ నాయకులు గుండపనేని ఉమావర ప్రసాద్, వేముపల్లి శ్రీని వాసరావు, కలపాల సూర్యనారాయణ, సర్పంచ్ కసుకుర్తి అర్జునరావు, హను మాన్‌జంక్షన్ పాలశీతల కేంద్రం మేనేజర్ వివి.సంపత్‌కుమార్, సూపర్ వైజర్ ఎ.గోపాల్, కార్యదర్శి ఆళ్ల గురవయ్య తదితరులు పాల్గొన్నారు.