కల్వర్టును ఢీ కొన్న కారు - మహిళ మృతి

ABN , First Publish Date - 2022-12-12T01:03:45+05:30 IST

జాతీయ రహదారిపై ఉమామహేశ్వ రపురం వద్ద కల్వర్టును ఢీ కొన్న కారు ప్రమాదంలో అందులో ప్రయాణిస్తున్న మహిళ అక్కడి క్కడే మృతి చెందగా కారు నడుపున్న వ్యక్తి తీవ్రగాయల పాలైన ఘటన ఆదివారం ఉద యం జరిగింది.

 కల్వర్టును ఢీ కొన్న కారు - మహిళ మృతి

హనుమాన్‌జంక్షన్‌ రూర ల్‌, డిసెంబరు 11 : జాతీయ రహదారిపై ఉమామహేశ్వ రపురం వద్ద కల్వర్టును ఢీ కొన్న కారు ప్రమాదంలో అందులో ప్రయాణిస్తున్న మహిళ అక్కడి క్కడే మృతి చెందగా కారు నడుపున్న వ్యక్తి తీవ్రగాయల పాలైన ఘటన ఆదివారం ఉద యం జరిగింది. వీరవల్లి ఎస్సై సుబ్రహ్మణ్యం వివరాల మేరకు.. హైదరాబాద్‌ నుంచి రామచం ద్రాపురానికి కుటుంబ సభ్యులు కారులో బయలుదేరారని, ఉమామహేశ్వరపురం వద్ద గల మలుపులో కారు అదుపు తప్పడంతో జాతీయ రహదారిపై గల కల్వర్టును బలంగా ఢీ కొట్టిందని తెలిపారు. ఈ ప్రమాదంలో కారు ముందు భాగం నుజ్జయి పోగా కారులో ప్రయాణిస్తున్న రామచంద్రాపురం మండలం రేలంగి గ్రామానికి చెందిన నెర్ల రాణి (57) అక్కడిక్కడే మృతి చెందింది. కారు నడుపుతున్న గొడవర్తి వాసు కాళ్లకు బలమైన గాయాలయ్యాయని, కారులో ఇద్దరు చిన్నపిల్లలతో కలిసి ఐదుగురు ప్రయాణిస్తున్నారని, చిన్నపిల్లలకు, తల్లికి ఏవిధమైన ప్రమాదం లేదని వివరించారు. మరణించిన మహిళ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గన్నవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించామని, క్షతగాత్రులను అంబులెన్స్‌లో విజయవాడ తరలించి కేసు నమోదు చేసినట్లు ఎస్సై సుబ్రహ్మణ్యం తెలిపారు.

Updated Date - 2022-12-12T01:03:45+05:30 IST

Read more