డిసెంబరు నాటికి ఇళ్ల నిర్మాణం పూర్తి చేయాలి

ABN , First Publish Date - 2022-09-25T06:53:15+05:30 IST

మల్లాయపాలెం జగనన్న లేఅవుట్‌లో గృహాల నిర్మాణం డిసెంబరు నాటికి పూర్తి చేయాలని జా యింట్‌ కలెక్టర్‌ ఆర్‌.మహేష్‌ కుమార్‌ అధికారులను ఆదేశించారు.

డిసెంబరు నాటికి ఇళ్ల నిర్మాణం పూర్తి చేయాలి

 జాయింట్‌ కలెక్టర్‌ మహేష్‌ కుమార్‌ 

గుడివాడటౌన్‌  : మల్లాయపాలెం జగనన్న లేఅవుట్‌లో గృహాల నిర్మాణం డిసెంబరు నాటికి పూర్తి చేయాలని జా యింట్‌ కలెక్టర్‌ ఆర్‌.మహేష్‌ కుమార్‌ అధికారులను ఆదేశించారు. జగనన్న లేఅవుట్‌లలో గృహ నిర్మాణాలను శనివఆరం ఆయన పరిశీలించారు.  డిసెంబరు 21న గుడివాడలో టిడ్కో గృహలను సీఎం ట్రస్ట్‌ జగన్మోహనరెడ్డి లాంఛనంగా ప్రారంభిస్తారన్నారు. వాటితో పాటు జగనన్న లేఅవుట్‌లో పూర్తి అయి ఇళ్లు గృహ ప్రవేశాలు జరుగుతాయన్నారు. ఆ లోపు గృహ నిర్మాణాలను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఆర్డీవో పి.పద్మావతి, తహశీల్దార్‌ ఆంజనేయులు, అసిస్టెంట్‌ కమిషనర్‌ రంగారావు పాల్గొన్నారు.

Read more