జంక్షన్‌లో ఆర్యవైశ్యుల నిరసన

ABN , First Publish Date - 2022-11-30T00:30:03+05:30 IST

తెలంగాణ రాష్ట్రం వనపర్తిలో వాసవి మాత ఆలయాన్ని ధ్వంసం చేయడాన్ని ఖండిస్తూ మంగ ళవారం బాపులపాడు మం డల ఆర్యవైశ్య సంఘం ఆధ్వ ర్యంలో నిరసన ప్రదర్శన నిర్వహించారు. దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేస్తూ జంక్షన్‌లోని నాలుగు రోడ్లులో నిరసన ప్రదర్శన చేశారు.

 జంక్షన్‌లో ఆర్యవైశ్యుల నిరసన
నిరసన ప్రదర్శనలో ఆర్యవైశ్య సంఘ నాయకులు

హనుమాన్‌జంక్షన్‌, నవంబరు 29 : తెలంగాణ రాష్ట్రం వనపర్తిలో వాసవి మాత ఆలయాన్ని ధ్వంసం చేయడాన్ని ఖండిస్తూ మంగ ళవారం బాపులపాడు మం డల ఆర్యవైశ్య సంఘం ఆధ్వ ర్యంలో నిరసన ప్రదర్శన నిర్వహించారు. దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేస్తూ జంక్షన్‌లోని నాలుగు రోడ్లులో నిరసన ప్రదర్శన చేశారు. స్థానిక ఏలూరు రోడ్డులోని వాసవీమాత ఆలయం నుంచి ర్యాలీ ప్రారంభించి నాలుగు రోడ్లులో ప్రదర్శన చేశారు. ఆర్యవైశ్య బాపులపాడు మండల అధ్యక్షుడు కంభంపాటి శ్రీనివాసరావు, మాజీ సర్పంచ్‌ తవ్వా మూర్తి, పూర్ణచంద్రరావు, చింతా కృష్ణ, తవ్వా కుటుంబరావు, చామర్తి లోక్‌నాథ్‌, నారికమల్లి ప్రసాద్‌, వాసవి క్లబ్‌ మహిళ నాయకులు తవ్వా పద్మ మాధురి, అప్పల సునీత, తవ్వా సూర్యకళ, పాబోలు అన్నపూర్ణ, కపిలవాయి భగవతి తదితరులు ప్రదర్శనలో పాల్గొన్నారు.

Updated Date - 2022-11-30T00:30:03+05:30 IST

Read more