రోడ్ల అధ్వానంపై జనసేన నిరసన

ABN , First Publish Date - 2022-07-18T06:36:55+05:30 IST

రోడ్ల అధ్వానంపై జనసేన చేపట్టిన నిరసన కార్యక్రమం విజయవాడ రూరల్‌ మండలం నున్నలో ఆదివారం జరిగింది.

రోడ్ల అధ్వానంపై జనసేన నిరసన
నున్న - ముస్తాబాద రోడ్డుపై నిరసన

రోడ్ల అధ్వానంపై జనసేన నిరసన

విజయవాడ రూరల్‌, జూలై 17 :  రోడ్ల అధ్వానంపై జనసేన చేపట్టిన నిరసన కార్యక్రమం విజయవాడ రూరల్‌ మండలం నున్నలో ఆదివారం జరిగింది. నున్న - ముస్తాబాద రోడ్డు అధ్వానంగా తయారైందని, గుంతలలో అధికారులు నామమాత్రంగానే మట్టిపోసి పూడుస్తున్నారని నాయకులు విమర్శించారు. గతంలో కిలోమీటరన్నర రోడ్డుకు రూ.80 లక్షలు మంజూరవ్వగా, వైసీపీ అధికారంలోకి వచ్చాక రద్దు చేశారన్నారు. రూరల్‌ మండల అధ్యక్షుడు పొదిలి దుర్గారావు, లంకే సురేష్‌ తదితరులు పాల్గొన్నారు. 

Read more