దేవరకోటలో జగ్జీవన్‌రామ్‌ విగ్రహావిష్కరణ

ABN , First Publish Date - 2022-09-11T06:29:48+05:30 IST

దేవరకోట దళితవాడలో ఏర్పాటు చేసిన బాబూ జగ్జీవన్‌ రామ్‌ విగ్రహాన్ని మా దిగ కార్పొరేషన్‌ చైర్మన్‌ కొ మ్మూరు కనకరావుతో కలిసి ఎమ్మెల్యే సింహాద్రి రమే్‌షబాబు శనివారం ఆవిష్కరించారు.

దేవరకోటలో జగ్జీవన్‌రామ్‌ విగ్రహావిష్కరణ

 ఘంటసాల :  దేవరకోట దళితవాడలో ఏర్పాటు చేసిన బాబూ జగ్జీవన్‌ రామ్‌ విగ్రహాన్ని  మా దిగ కార్పొరేషన్‌ చైర్మన్‌ కొ మ్మూరు కనకరావుతో కలిసి ఎమ్మెల్యే సింహాద్రి రమే్‌షబాబు శనివారం ఆవిష్కరించారు. మాదిగ కార్పొరేషన్‌ చైర్మన్‌ కొమ్మూరు కనకరావు మాట్లాడుతూ రిజర్వేషన్‌ పరిరక్షకుడు బాబూజగ్జీవన్‌ రామ్‌ అని పేర్కొన్నారు.  బాబూ జగ్జీవన్‌ రామ్‌ విగ్రహాన్ని నెలకొల్పిన విగ్రహదాత కొక్కిలిగడ్డ వెంకటేశ్వరరావు అభినందనీయులని ప్రశంసించారు. నవ్యాంధ్ర మాదిగ ఎంప్లాయిస్‌ ఫెడరేషన్‌ రాష్ట్ర అధ్యక్షుడు కైతేపల్లి దాస్‌ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఎస్సీ, ఎస్టీ ఎంప్లాయిస్‌ అసోసియేషన్‌ రాష్ట్ర అధ్యక్షుడు దేవరపల్లి సురేష్‌, సర్పంచ్‌ మ ద్దాలి వెంకటేశ్వరరావు, ఎంపీటీసీ సభ్యుడు కొప్పుల రాములమ్మ, వైసీపీ నేతలు వేమూరి రాజేంద్ర, చిట్టూరి రమేష్‌, నలుకుర్తి రమేష్‌, కోన సతీష్‌, జగ్జీవన్‌ రామ్‌ యూత్‌ సభ్యులు, గ్రామస్థులు పాల్గొన్నారు.  Read more