-
-
Home » Andhra Pradesh » Krishna » jagan palanalo praja jeevanam durbharam-NGTS-AndhraPradesh
-
జగన్ పాలనలో ప్రజా జీవనం దుర్భరం
ABN , First Publish Date - 2022-08-15T06:43:47+05:30 IST
జగన్ పాలనలో ప్రజా జీవనం దుర్భరం

టీడీపీ ఇన్చార్జి బోడె ప్రసాద్
పెనమలూరు, ఆగస్టు 14 : జగన్ ప్రభుత్వ పాలనలో ప్రజలకు కనీస అవస రాలు కరువై దుర్భర జీవితాలను అనుభ విస్తున్నారని టీడీపీ ఇన్చార్జి బోడె ప్రసాద్ విమర్శించారు. ఆదివారం గంగూరులో జరిగిన బాదుడే బాదుడు కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. జగన్ అవినీతి అక్ర మాల వల్ల అన్ని వస్తువుల ధరలు ఆకాశా న్నంటుతు న్నాయని దుయ్యబట్టారు. ఇసుక, సిమెంటు, స్టీలు ధరలు రెట్టింపై పేద, మధ్య తరగతి ప్రజలు కనీసం ఇల్లు కట్టుకొనే పరిస్థితి లేదన్నారు. ఇంటి పన్ను ఎన్నో రెట్లు పెంచి చెత్త మీద కూడా పన్ను విధించడం జగన్ ప్రభుత్వానికే చెల్లిందన్నారు.ప్రభుత్వ పెద్దలు సొంతంగా మద్యం వ్యాపారంలో దిగి నాసిరకం మద్యాన్ని సామాన్యుడికి అధిక ధరలకు అంటగట్టి దోపిడీకి పాల్పడు తున్నారని ఎద్దేవా చేశారు. ఓటీఎస్ పేరుతో చేసిన దోపిడీని ప్రజలు గుర్తుంచుకొని వచ్చే ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని కోరారు. ఈ కార్యక్రమంలో టీడీపీ హయాంలో జరిగిన అభివృద్ధి, వైసీపీ హయాంలో జరిగిన అవినీ తిని వివరించే కరపత్రాలను పంపిణీ చేశారు. అనారోగ్యంతో బాధపడు తున్న గ్రామ సర్పంచి అబ్దుల్ తస్లీమున్నీ సాను పరామర్శించారు. ఈ కార్యక్ర మంలో టీడీపీ తాడిగడప మునిసిపాలిటీ అధ్యక్షుడు అనుమోలు ప్రభాకరరావు, నాయకులు కోయ ఆనంద ప్రసాద్, దొంతగాని పుల్లేశ్వ రరావు, గౌస్, ఫరా, శివ, కోటయ్య, అక్రమ్, జయరాజు తదితరులు పాల్గొన్నారు.
టీడీపీ హయాంలోనే అభివృద్ధి
గుణదల : నాపై బురదజల్లడం మాను కొని ప్రజా సమస్యలపై దృష్టిపెట్టాలని టీడీపీ గన్నవరం నియోజకవర ఇన్చార్జి బచ్చుల అర్జునుడు వైసీపీ నాయకులకు హితవు పలికారు. రామవరప్పాడులో బాదు డే బాదుడు కార్యక్రమం ఆదివారం నిర్వహిం చారు. ఈ సందర్భంగా స్థానికుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయాంలోనే రామవరప్పాడు అభివృద్ధి జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు గొడ్డళ్ల చినరా మా రావు, నాయకులు కోనేరు సందీప్, అద్దేపల్లి హరి, మున్నంగి సత్యనారాయణ, పట్టపు చంటి, అద్దేపల్లి సాంబశివ నాగరాజు, గరి మెళ్ల నరేంద్రనాథ్, బొమ్మసాని అరుణ, ప్రభుదాస్, గూడవల్లి నరసయ్య, దండు సుబ్రహ్మణ్యరాజు, గుజ్జర్లపూడి బాబూరావు, పరుచూరి నరేష్, పొదిలి లలిత, మండవ అన్వేష్, పోకా కిరణ్, పరిటాల గణేష్, పరిటాల జోగేంద్ర, పుట్టి నాగమణి, బోడ పాటి రవికుమార్ పాల్గొన్నారు.