AP News: దుర్గమ్మకు పట్టువస్త్రాలు సమర్పించిన జగన్

ABN , First Publish Date - 2022-10-02T21:26:02+05:30 IST

విజయవాడ: విజయవాడ కనకదుర్గమ్మ ఆలయంలో దసరా శరన్నవరాత్రులు వైభవంగా జరుగుతున్నాయి. ఆదివారం మూలా నక్షత్రం రోజున సీఎం జగన్ మోహన్ రెడ్డి దుర్గమ్మ సన్నిధికి వచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఆయన అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించారు. పట్టువస్త్రాలతో పాటు పసుపు, కుంకుమలు కూ

AP News: దుర్గమ్మకు పట్టువస్త్రాలు సమర్పించిన జగన్

విజయవాడ: విజయవాడ కనకదుర్గమ్మ ఆలయంలో దసరా శరన్నవరాత్రులు వైభవంగా జరుగుతున్నాయి.  ఆదివారం మూలా నక్షత్రం రోజున సీఎం జగన్ మోహన్ రెడ్డి  దుర్గమ్మ సన్నిధికి వచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఆయన  అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించారు. పట్టువస్త్రాలతో పాటు పసుపు, కుంకుమలు కూడా అందజేశారు. ఈ సందర్భంగా అర్చకులు  ముఖ్యమంత్రికి వేదాశీర్వచనం పలికి, అమ్మవారి చిత్రపటంతో పాటు తీర్థప్రసాదాలు అందజేశారు. అంతకుముందు, దుర్గగుడిలో సీఎం జగన్‌కు వేదపండితులు, దేవస్థానం అధికారులు పూర్ణకుంభ స్వాగతం పలికారు. సీఎంకు మంత్రులు కొట్టు సత్యనారాయణ, తానేటి వనిత, ఎమ్మెల్యేలు వెల్లంపల్లి శ్రీనివాస్, కొడాలి నాని కూడా స్వాగతం పలికారు. సీఎం రాక నేపథ్యంలో ఇంద్రకీలాద్రిపై భారీ భద్రత ఏర్పాటు చేశారు. 

Updated Date - 2022-10-02T21:26:02+05:30 IST