-
-
Home » Andhra Pradesh » Krishna » Jagan ignored the welfare of BCs-NGTS-AndhraPradesh
-
బీసీల సంక్షేమాన్ని విస్మరించిన జగన్
ABN , First Publish Date - 2022-09-25T05:44:08+05:30 IST
ఒక్క ఛాన్స్ అని అధికారంలోకి వచ్చిన జగన్‌మోహన్ రెడ్డి బీసీల సంక్షేమాన్ని విస్మరించారని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు బొండా ఉమామహేశ్వరరావు మండిపడ్డారు.

బీసీల సంక్షేమాన్ని విస్మరించిన జగన్
పాయకాపురం, సెప్టెంబరు 24 : ఒక్క ఛాన్స్ అని అధికారంలోకి వచ్చిన జగన్‌మోహన్ రెడ్డి బీసీల సంక్షేమాన్ని విస్మరించారని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు బొండా ఉమామహేశ్వరరావు మండిపడ్డారు. టీడీపీ రాష్ట్ర బీసీ సెల్ ఉపాధ్యక్షుడిగా నియమితుడై ఇటీవల ప్రమాణస్వీకారం చేసిన దివి ఉమామహేశ్వరరావు మొగల్రాజపురంలోని బొండా ఉమ నివాసంలో శనివారం ఆయనను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్బంగా బొండా ఉమ ఆయనకు శాలువా కప్పి అభినందనలు తెలియజేశారు. ఘంటా కృష్ణమోహన్, టీఎన్‌టీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు గొట్టుముక్కల రఘురామరాజు, గొట్టుముక్కల వెంకి తదితరులు పాల్గొన్నారు.