జగన్‌ దృష్టిలో రాజ్యాంగమంటే దోచుకోవడమే : జడ

ABN , First Publish Date - 2022-12-10T01:13:22+05:30 IST

రాజ్యాంగం ప్రామాణికమని బీసీల సభలో సీఎం జగన్‌ చక్కగా చెప్పారని, ఆయన దృష్టిలో రాజ్యాంగం అంటే కోట్లు దోచుకోవడం, బంధువర్గానికి పదవులివ్వడమేనా అని ఽప్రముఖ హైకోర్టు న్యాయవాది, జైబీమ్‌ భారత్‌ పార్టీ వ్యవస్థాపకుడు జడ శ్రావణ్‌కుమార్‌ ధ్వజమెత్తారు.

జగన్‌ దృష్టిలో రాజ్యాంగమంటే దోచుకోవడమే : జడ

ధర్నాచౌక్‌, డిసెంబరు 9 : రాజ్యాంగం ప్రామాణికమని బీసీల సభలో సీఎం జగన్‌ చక్కగా చెప్పారని, ఆయన దృష్టిలో రాజ్యాంగం అంటే కోట్లు దోచుకోవడం, బంధువర్గానికి పదవులివ్వడమేనా అని ఽప్రముఖ హైకోర్టు న్యాయవాది, జైబీమ్‌ భారత్‌ పార్టీ వ్యవస్థాపకుడు జడ శ్రావణ్‌కుమార్‌ ధ్వజమెత్తారు. శుక్రవారం ఆయన కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ ప్రతి రాజకీయ పార్టీకి సభలు, సమావేశాలు నిర్వహించుకునే హక్కుంటుందని, రాష్ట్రలో మాత్రం ప్రతిపక్షాల సభలు, సమావేశాలకు అనుమతులివ్వకుండా అడ్డుకుంటూ కొత్త సంస్కృతికి జగన్‌ ప్రభుత్వం తెరలేపిందని విమర్శించారు. హైకోర్టు ఆదేశాలను ప్రభుత్వం అమలు చేయడం లేదన్నారు. న్యాయస్థానాలంటే ప్రభ్చుత్వానికి గౌరవం లేదన్నారు. విశాఖలో తమ పార్టీ ఆధ్వర్యంలో డాక్టర్‌ సుధాకర్‌ సంస్మరణ సభకు అనుమతి లేదంటూ పోలీసులు అడ్డుకోవడం దుర్మార్గమన్నారు. వేల కోట్లు దోచుకున్న వైఎస్సాఆర్‌ పేరును మాత్రం ఎన్టీఆర్‌ వర్శిటీ పేరు తొలగించి పెడతారా అని మండిపడ్డారు. విశాఖ పోలీస్‌ కమిషనర్‌ శ్రీకాంత్‌ వైసీపీ పార్టీకి తొత్తుగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఖాకీ చొక్కా తీసేసి వైసీపీ కండువా తొడుక్కోవాలన్నారు. ఐపీఎస్‌ అధికారిగా హైకోర్టు ఆదేశాలను అమలు చేయడం మీ బాధ్యత కాదా? అని ప్రశ్నించారు. కోర్టు ధిక్కారణపై ఆయన్ను హైకోర్టులో నిలబెడతానన్నారు. ఎక్కడ అనుమతులు రద్దు చేశారో అక్కడే న్యాయస్ధానం ఆదేశాలతో డాక్టర్‌ సుధాకర్‌ సంస్మరణ సభ నిర్వహించి తీరుతామన్నారు. ప్రభుత్వాలు శాశత్వం కాదని పోలీసులు గుర్తుంచుకోవాలని హితవు పలికారు.

Updated Date - 2022-12-10T01:13:24+05:30 IST