ఐటీఐ విద్యార్థి ఆత్మహత్య

ABN , First Publish Date - 2022-09-19T06:17:34+05:30 IST

ఐటీఐ విద్యార్థి ఆత్మహత్య

ఐటీఐ విద్యార్థి ఆత్మహత్య

అజిత్‌సింగ్‌నగర్‌, సెప్టెంబరు 18: ఐటీఐ చదువుతున్న ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటనపై అజిత్‌సింగ్‌నగర్‌ పోలీసులు ఆదివారం కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..న్యూ రాజరాజేశ్వరిపేట ప్రాంతానికి  చెందిన కట్టా చందు(19) ఐటీఐ చదువుతున్నాడు. ఆదివారం రాత్రి గదిలోకి వెళ్లి తలుపువేసుకున్నాడు. భోజనం చేయడానికి రమ్మని కుటుంబ సభ్యులు అతనిని పిలిచారు. ఎంతసేపు తలుపులు కొట్టినా తీయక పోవడంతో వాటిని బద్దలు కొట్టారు. అప్పటికే చందు ఇంట్లో ఫ్యాను రాడ్డుకు ఉరివేసుకుని వేలాడుతూ కనిపించాడు. అతను మృతి చెందాడన్న సమాచారం అందుకున్న పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. 

Read more